వీరజవాన్ల పారితోషికాన్ని పెంచాలి
● ప్రధాని మోదీకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి లేఖ
● కేంద్ర హోంశాఖ నుంచి సానుకూల స్పందన
ఉరవకొండ: దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు చెల్లిస్తున్న పారితోషికాన్ని పెంచి వారి కుటుంబాలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్నాన్ని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విన్నవించారు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీకు ఆయన లేఖ రాయగా.. దీనిపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించింది. వివరాలను బుధవారం శివరామిరెడ్డి వెల్లడించారు. వీర జవాన్లకు ఇప్పటి వరకూ రూ.25 లక్షలు మాత్రమే ఎక్స్‌గ్రేషియాను కేంద్రం చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం ఉండదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దీనికి పరిష్కార దిశగా ప్రధానితో పాటు కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖ, ఏపీ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. వీర జవాన్ల పారితోషికాన్ని రూ.2 కోట్లకు పెంచి, వారి కుటుంబానికి నివేశన స్థలం, కుటుంబసభ్యుల్లో ఒకరికి గ్రూప్–1 లేదా గ్రూప్–2 ఉద్యోగాలు కల్పించాలని, వారి పిల్లలు ఎంత వరుకు చదివితే అంత వరుకూ ఉచితంగా చదివించాలని లేఖలో కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం, రక్షణ మంత్రిత్వ శాఖ లేఖను.. ఎక్స్–సర్వీస్‌మెన్ వెల్ఫర్ డిపార్ట్‌మెంట్‌కు ఎండార్స్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరజవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment