జిల్లా అంతటా గురువారం చలి వాతావరణం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా గాలి వీచింది.
కంది కొనుగోలు విషయంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు చూసి రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. కేవలం మూడు క్వింటాళ్లు కొనాలని షరతు విధించడం సరికాదన్నారు. విప్ కాలవ స్పందిస్తూ.. బయటి మార్కెట్‌కు, ప్రభుత్వ ధరకు మధ్య క్వింటాలుకు రూ.1,000 వ్యత్యాసం ఉందని, 5 క్వింటాళ్ల వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. బ్రహ్మసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు ప్రభావతి మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. తమ మండలంలో అన్ని శాఖలకు ఇన్చార్జ్ అధికారులే దిక్కు కావడంతో పనులు జరగడం లేదని చిలమత్తూరు జెడ్పీటీసీ అనూష అధికారుల దృష్టికి తెచ్చారు. వివిధ పనుల నిమిత్తం అనంతపురానికి వస్తే.. కనీసం అతిథి గృహ సదుపాయం కూడా లేదని, శిథిలావస్థకు చేరిన జెడ్పీ అతిథి గృహాలకు మరమ్మతులు చేయాలని కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు కోరారు. తమ ప్రాంతానికి వచ్చే పల్లె వెలుగు బస్సుకు కండక్టర్ లేకుండా వన్‌మ్యాన్ సర్వీసును నడపడం వల్ల ఒక విద్యార్థి మృత్యువాతపడ్డాడని విడపనకల్లు జెడ్పీటీసీ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment