మహాత్ముని అడుగుజాడల్లో నడుద్దాం
అనంతపురం కార్పొరేషన్: అహింస, శాంతి ద్వారానే ఏదైనా సాధ్యమని నిరూపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని, అటువంటి మహనీయుని అడుగుజాడల్లో నడుద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ మాట్లాడుతూ ప్రపంచమంతా మహాత్మా గాంధీకి నివాళులర్పించిందని తెలిపారు. అంటరానితనం రూపుమాపాలని, బడుగులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆయన పరితపించారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారన్నారు. కూటమి ప్రభ్వుత్వం ఆ వ్యవస్థను నీరు గార్చడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీచైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, పార్టీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమ శేఖర్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్ర, మల్లెమీద నరసింహులు, శ్రీదేవి, సైఫుల్లా బేగ్, అమర్‌నాథ్ రెడ్డి, చంద్రలేఖ, కార్పొరేటర్లు కమల్‌భూషణ్, ఇసాక్, రాజేశ్వరి, నాయకులు కుళ్లాయస్వామి, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment