సెంట్రల్ వర్సిటీ రిజిస్ట్రార్‌గా షీలారెడ్డి
అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సి. షీలా రెడ్డి నియమితులయ్యారు. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న 15 మంది ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలకు హాజరైనా..
నాణ్యమైన పరిశోధనలు, పాలనలో సమర్థత, విశేషమైన బోధనానుభవం ఉండడంతో షీలారెడ్డికి అవకాశం దక్కింది. సెంట్రల్ వర్సిటీ తొలి రిజిస్ట్రార్ ఆమే కావడం గమనార్హం. ప్రొఫెసర్ షీలారెడ్డికి అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (అప్పా)కు సంబంధించి మూడు సార్లు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలతో పాటు రెండు అంతర్జాతీయ, రెండు జాతీయ సదస్సులను నిర్వహించారు. 14 అంతర్జాతీయ జర్నల్స్, 19 జాతీయ జర్నల్స్, 14 బుక్ చాప్టర్స్, 6 పుస్తకాలు రచించారు. 5 మేజర్, 5 మైనర్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు. 30 అంతర్జాతీయ సదస్సుల్లో ప్రసంగించారు. రెండు పీహెచ్‌డీ అవార్డులు షీలారెడ్డి పర్యవేక్షణలో పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment