![చింతప](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06hdp302-110136_mr-1738872142-0.jpg.webp?itok=FN3ZRkfw)
చింతపండుకు రికార్డు ధర
హిందూపురం అర్బన్: చింతపండుకు గరిష్ట ధర దక్కింది. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 364 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. మొదటి రకం (కరిపులి) కనిష్ట ధర క్వింటాలు రూ.8,200, సగటు ధర రూ.15వేలు, గరిష్ట ధర రూ.29 వేలు పలికింది. ఇక రెండో రకం (ఫ్లవర్) కనిష్ట ధర క్వింటాలు రూ.4వేలు, సగటు ధర రూ.8,500, గరిష్టం రూ.9,500 పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో మిర్చి క్రయ విక్రయాలు మార్కెట్‌లో జరుగుతున్నాయని, రైతులు, వ్యాపారులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి మంచి ధరలు పొందాలని సూచించారు.
సేవాలాల్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం
గుత్తి రూరల్: సేవాలాల్ జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ సేవా గఢ్‌లో సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 286వ జయంత్యుత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ వినోద్‌కుమార్ సమీక్ష చేపట్టారు. గురువారం సేవాగఢ్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో సేవాగఢ్ ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్, ప్రధాన కార్యదర్శి అశ్వత్థనాయక్, గుత్తి, గుంతకల్లు మండలాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ క్రమంలో సేవాలాల్ ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.గుత్తి, గుంతకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, తాత్కాలిక స్నానపు గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీప గ్రామాల్లో నాటుసారా, మద్యం అమ్మకాలు జరగకుండా చూడాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు సేవాలాల్ మహరాజ్, మాతా జగదాంబ ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, సర్పంచ్ అప్పా వెంకటేష్, ట్రస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, కోశాధికారి బాలానాయక్, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీఓ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఓబిలేసు, ఈఓఆర్డీ శివాజీరెడ్డి, డీటీ సూర్యనారాయణ పాల్గొన్నారు
సిబ్బంది జీతాలు
ఎందుకు కట్ చేస్తున్నారు?
● బొమ్మనహాళ్ పీహెచ్‌సీ వైద్యురాలిపై డీఎంహెచ్‌ఓ మండిపాటు
బొమ్మనహాళ్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి (డీఎంహెచ్‌ఓ) ఈబీ దేవి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది రికార్డులను పరిశీలించారు. బొమ్మనహాళ్ పీహెచ్‌సీ వైద్యాధికారిణి శ్రీలక్ష్మీ పనితీరుపై సిబ్బందితో విడివిడిగా విచారించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది జీతాలు ఎందుకు కట్ చేస్తున్నావని మండిపడ్డారు. తనతోనే ఇలా మాట్లాడితే, ఇక సిబ్బందితో ఎలా ఉంటారో అర్థమవుతోందన్నారు. తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యాధికారిణి శ్రీలక్ష్మీ ఓపీ చూడడం లేదని ఇటీవల ఫిర్యాదులు అందాయని, దీంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో కాన్పులు స్టాఫ్‌నర్సులే చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వైద్యాధికారి, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని సూచించామన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు.
![చింతపండుకు రికార్డు ధర 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06gtl404b-110016_mr-1738872143-1.jpg)
చింతపండుకు రికార్డు ధర
![చింతపండుకు రికార్డు ధర 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06rdg701-110066_mr-1738872143-2.jpg)
చింతపండుకు రికార్డు ధర
Comments
Please login to add a commentAdd a comment