
మైసూరు–అజ్మీర్‌కు సమ్మర్ స్పెషల్ రైలు
రాయదుర్గంటౌన్: రాయదుర్గం మీదుగా మైసూరు నుంచి అజ్మీర్‌కు సమ్మర్ స్పెషల్ రైలు సర్వీసు నడుస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మంజునాథ కనమడి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మైసూరు–అజ్మీర్ (06281) ఏప్రిల్ 5,12,19,26 తేదీల్లో, మే 3,10,17,24 తేదీల్లో, జూన్ 7, 14 తేదీల్లో ప్రతి శనివారం (మొత్తం 11 సర్వీసులు) రైలు నడుస్తుందన్నారు. మైసూరులో ఉదయం 8 గంటలకు బయల్దేరి హాసన్, అర్సికెరె, చిత్రదుర్గం, రాయదుర్గం, బళ్లారి కంటోన్మెంట్, హుబ్లీ, కళ్యాణ్, వడోదర మీదుగా సోమవారం ఉదయం 6.55 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో (06282) ఏప్రిల్ 7,14,21,28 తేదీల్లో, మే 5, 12, 19,26 తేదీల్లో, జూన్ 2,9,16 తేదీల్లో ప్రతి సోమవారం (11 సర్వీసులు) సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మైసూరు చేరుకుంటుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభమైందని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాయదుర్గం మీదుగా రాకపోకలు