
AP Elections Political Latest Updates Telugu..
08:45PM, జనవరి 5, 2024
ఏం చేశాడని బాబు పిలిస్తే రావాలి!
- రా.. కదలిరా అని చంద్రబాబు పిలవగానే జనం ఎందుకు రావాలి?
- టీడీపీ అధినేతపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు
- పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టిన గతి పట్టకూడదు
- బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు
- చంద్రబాబు, పవన్ లకు పిచ్చిమాటలు మాట్లాడే అవలక్షణం ఉంది
- జగన్ 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, సచివాలయాలు, స్కూల్స్ కట్టించారు
- లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి
- చంద్రబాబు లేకపోతే రాష్ట్ర ప్రజలు అసలు విమానాలే ఎక్కనట్లు మాట్లాడుతున్నారు
- అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు.. అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారు
- బిగ్ బజారులో వాటాలు ఉన్న చంద్రబాబు నిత్యావసర వస్తువులను ఎందుకు అధికంగా అమ్ముతున్నారు
- ప్రజలను తాగుబోతులను చేసేలా చంద్రబాబు మాటలు ఉన్నాయి
- బీసీలకు ఏం చేశావని చంద్రబాబుకు ఓట్లు వేయాలి?
- ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారా?
- చంద్రబాబుకు ఆయన ఇంట్లో, బంధువుల్లోనూ వ్యతిరేకమే
- ఎన్టీఆర్ కుటుంబం నుండి తోడపుట్టిన సోదరులు, అక్క, వారి పిల్లలు అందరూ వ్యతిరేకమే
- అలాంటి వ్యక్తి ఎదుటివారి గురించి ఎలా మాట్లాడతారు?
- రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోని కాపీ కొట్ఠం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ
- 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు
- అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?
- కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అప్పట్లో తునిలో మీటింగ్ పెట్టారు
- చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను అమలు చేయమనే కాపులు ఉద్యమం చేశారు
- మరి ఇప్పటికీ పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?
- తనకు కులం లేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
- అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు మా పార్టీ వీడుతున్నారు
- జగన్‌ని నమ్మిన వారంతా పార్టీలోనే ఉన్నారు
- జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారు
- షర్మిళ ఒక రాజకీయ నాయకురాలు
- ఆమె ఏపీకి వస్తే మాకేం ఇబ్బంది ఉంటుంది?
- వైసీపిని జగన్ ప్రారంభించారు
- ఆయన్ను చూసే షర్మిళ ఐనా, నేనైనా ఇంకొందరైనా పార్టీలో చేరాం
- కొందరు వదిలేది పోయినంత మాత్రాన ఏం జరుగుతుంది?
- జగన్ బొమ్మ లేకుండా కాపు రామచంద్రారెడ్డి గెలవలేరు
08:15PM, జనవరి 5, 2024
కనిగిరిలో రా.. కదలి రా అట్టర్ ఫ్లాప్
- ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి(ప్రకాశం) నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ
- కనిగిరిలో రా.. కదలి రా పేరుతో చంద్రబాబు నాయుడు సభ
- భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీ శ్రేణులు.. చివరకు నిరాశ
- ఊహించిన రీతిలో.. సభ ఫ్లాప్
- షాక్ తిన్న టీడీపీ నేతలు
- చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే వెళ్లిపోయిన జనం
- ఖాళీ కుర్చీలకే చంద్రబాబు ప్రసంగం
- ప్రసంగంలోనూ తన స్టయిల్‌లో గప్పాలు కొట్టుకున్న చంద్రబాబు
- గతంలో కంటే ఘోరమైన హామీలు ఇచ్చిన బాబు
- టీడీపీ-జనసేన కలిసినా కూడా జనం తిరస్కరణ
06:04PM, జనవరి 5, 2024
బాబు గ్యారెంటీ ఇవ్వాల్సింది వాళ్లకు!
- సొంత పార్టీ నేతల్ని కూడా మోసం చేయగల ఘనుడు చంద్రబాబు
- విజయవాడ ఎంపీ కేశినేని నానినే అందుకు ఉదాహరణ
- డబ్బు ఉన్న వ్యక్తులే తన నాయకులు అని చంద్రబాబు నిరూపించారు
- చంద్రబాబును నమ్మి వెంట నడిచిన కేశినేని నానిని మోసం చేశారు
- వ్యక్తిత్వం గల వారిని నాయకులను చేసిన లీడర్ జగన్ మోహన్ రెడ్డి
- ప్రజలకు కాదు ముందు లోకేష్‌కి.. టీడీపీ నాయకుల భవిష్యత్తుకు చంద్రబాబు గ్యారెంటీ ఇవ్వాలి
- చంద్రబాబుపై దేవినేని అవినాష్ సెటైర్లు
05:53PM, జనవరి 5, 2024
కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా: కేశినేని నాని
- మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది: కేశినేని నాని
- ఎల్లుండి సభకు నన్ను రావొద్దన్నారు: కేశినేని నాని
- వసంత కృష్ణ ప్రసాద్, నేను చాలా సన్నిహితులం: కేశినేని నాని
- ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డారు.. నా పార్టీకి నేను కష్టపడ్డా: కేశినేని నాని
- ఎంపీగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పా?: కేశినేని నాని
- మూడోసారి ఎంపీని నేనే: కేశినేని నాని
- ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది: కేశినేని నాని
- కాలమే అన్నింటిని నిర్ణయిస్తుంది: కేశినేని నాని
- ఈసారి టీడీపీ తరఫున కేశినేనిని నో టికెట్
- పార్టీ కోసం కష్టపడుతున్నా.. పక్కన పెడుతున్నారనే ఆవేదనలో నాని
- చంద్రబాబు సభకు రావొద్దని ఇప్పటికే నానికి ఆదేశాలు
- చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తానంటూ కేశినేని నాని వ్యాఖ్య
05:35PM, జనవరి 5, 2024
జగనన్న హయాంలోనే కనిగిరిలో సంక్షేమాభివృద్ధి.. ఇంక నువ్వేంది చేసేది బాబూ?
- కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలిరా’ ఎన్నికల ప్రచారం
- కనిగిరి అభివృద్ధికి తనదీ హామీ అంటూ ప్రకటన
- జగనన్న పాలనలోనే కనిగిరిలో సంక్షేమాభివృద్ధి
- వివిధ సంక్షేమ పథకాల కింద కనిగిరి నియోజకవర్గంలో 2,54,213 మందికి రూ.1382 కోట్ల లబ్ధి చేకూరింది.
- కనిగిరి నియోజకవర్గంలో ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
- రూ.143 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలో సీసీరోడ్డు, సచివాలయ భవనాలు నిర్మించారు.
- రూ.56 కోట్లతో నాడు– నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధి పనులు.
- రూ. 56 కోట్లతో నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, మరమ్మతులు
- రూ.586 కోట్లతో జరుగుతున్న జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు
- రూ.129 కోట్లతో మున్సిపాలిటీలో ఇంటింటికీ నల్లా మంచినీటి పథకం
- రూ.105 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్ కింద జల్ జీవిన్ మిషన్ కింద పనులు
- రూ.122 కోట్లతో కనిగిరి ఓవీ రోడ్డు, కనిగిరి– కలగట్ల రోడ్డు, పీసీపల్లి, మాలకొండ రోడ్డు, మోటుపల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయి.
- రూ.1,250 కోట్లతో కనిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాలకు నీటి సరఫరాకు వాటర్ గ్రిడ్ పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయి. సర్వే పనులు జరుగుతున్నాయి.
- ఇంటికి పంపేది వైఎస్సార్‌సీపీని కాదు.. మళ్లీ టీడీపీనేనంటూ కనిగిరి సభపై సోషల్ మీడియాలో సెటైర్లు
04:22PM, జనవరి 5, 2024
దేవినేని ఉమకు కొత్త తలనొప్పి
- బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం
- ఎమ్మెల్యే రేసులో తాను ఉన్నానని.. తనకే టికెట్ కేటాయించాలని చంద్రబాబుని కోరిన బొమ్మసాని
- ఆత్మీయ సమావేశానికి రావాలంటూ జనసేన నేతలకు ఆహ్వానం
- టీడీపీకి కేశినేని నాని దూరంగా ఉంటానని ప్రకటించడంతో ఆసక్తిగా మారిన ఆత్మీయ సమావేశం
- మాజీ మంత్రి దేవినేని ఉమకు తలనొప్పిగా మారిన అసమ్మతి వర్గం
03:09PM, జనవరి 5, 2024
వెన్నుపోటుకు వెన్నుపోటు పొడవలేదు
- నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు : కేశినేని నాని
- వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని
- నన్ను వద్దని చంద్రబాబు అనుకున్నారు.. నేను అనుకోలేదు
- చంద్రబాబుతో రోజూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటా
- నామినేషన్ల చివరి వరకూ అభ్యర్థులను తేల్చేవారు కాదు
- నా విషయంలోనే చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకున్నారు
- నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది : కేశినేని నాని
02:19PM, జనవరి 5, 2024
స్కిల్ కేసులో తెరపైకి అప్రూవర్
- స్కిల్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన చంద్ర కాంత్ షా
- ఇప్పటికే అప్రువర్గా మారిన చంద్రకాంత్
- స్కిల్ స్కామ్ కేసులో A13 నిందితుడుగా చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డ్ చేయనున్న ఏసీబీ కోర్టు
01:32PM, జనవరి 5, 2024
చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయ్
- చంద్రబాబు బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్
- అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరు
- పవన్ కల్యాణ్ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు.. బీసీలే వెన్నుముక అని ఎలా? అంటారు
- ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప.. బీసీల కోసం చంద్రబాబు ఏం పాటు పడ్డాడో చెప్పాలి
- ఓసీ రిజర్వుడు పదవులను కూడా ఇస్తూ.. బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారు
- సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే.. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ ఇచ్చారా?
- విద్య,వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు
- 2024లో చంద్రబాబు, దత్తపుత్రుడి మబ్బులన్నీ విడిపోతాయి
12:25PM, జనవరి 5, 2024
ఏపీ కాంగ్రెస్ ట్వీట్ పై స్పందించిన మంత్రి అంబటి
- అమరుడైన రాజశేఖరరెడ్డిపై కేసులు బనాయించినప్పుడే కల చెదిరింది..
- కథ మారిందంటూ రీట్వీట్ చేసిన మంత్రి అంబటి
అమరుడైన రాజశేఖరుని పై
కేసులు బనాయించినప్పుడే
కల చెదిరింది-కథ మారింది !@INCIndia @RahulGandhi— Ambati Rambabu (@AmbatiRambabu) January 5, 2024
12:00PM, జనవరి 5, 2024
నా నిర్ణయం త్వరలో ప్రకటిస్తా: కేశినేని నాని
- నేను ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తా: కేశినేని నాని
- ఫిబ్రవరి మొదటివారంలో నా నిర్ణయం ప్రకటిస్తా: కేశినేని నాని
- వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడిని
- నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు
11:50AM, జనవరి 5, 2024
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం:కాకాణి
- అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పథకం: మంత్రి కాకాణి
- ఎన్నికల ముందు చంద్రబాబు హామీలిస్తాడు
- ఎన్నికల తర్వాత మేనిఫెస్టో మాయం చేస్తాడు: మంత్రి కాకాణి
- మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం:కాకాణి
10: 40AM, జనవరి 5, 2024
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరి
- దళితులపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి
- దళిత నేత, వైఎస్సార్‌సీపీ కార్యకర్త భాస్కర్ దంపతులపై దాడి
- జగనన్న కాలనీ కోసం ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న జేసీ
- టైర్లకు గాలి తీసి, దళిత నేత భాస్కర్‌పై దాడి చేసిన జేసీ
- జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్
08:19AM, జనవరి 5, 2024
కేశినేని నానికి చెక్ పెట్టిన టీడీపీ అధిష్టానం
- తిరువూరులో జరిగే చంద్రబాబు సభకు మరో ఇంచార్జ్ నియామకం
- తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించిన చంద్రబాబు
- వచ్చే ఎన్నికల్లో ఎంపీగా మరొకరికి చాన్స్ ఇవ్వాలని నిర్ణయం
- ఇకపై ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశం
7:05 AM, జనవరి 5, 2024
పచ్చ బ్యాచ్‌కు గట్టి దెబ్బ తప్పదు
- ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే మాట..
- చంద్రబాబు నాటకం ప్రజలకు తెలిసిపోయింది
- సీఎం జగనే మా నమ్మకం అంటున్న ప్రజలు
ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే మాట…📢
— YSR Congress Party (@YSRCParty) January 4, 2024
ఆపు బాబు నాటకం…🫸🏻
జగనే మా నమ్మకం…♥️🙌🏻#AapuBabuNatakam#JaganeMaaNammakam pic.twitter.com/cjkedBBv4h
7:00 AM, జనవరి 5, 2024
జగన్ వ్యూహం.. పచ్చమంద బెంబేలు
- చంద్రబాబు కుల పత్రిక ఈనాడులో పిచ్చిరాతలు
- తాజాగా.. పెత్తందారీ పోకడ అనే శీర్షికన వార్త
- చంద్రబాబు,ఈనాడు పత్రికల పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్
- ఇంతకాలం బీసీలను బానిసలుగా చూసిన పెత్తందారులు టీడీపీ నాయకులే
- రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక మోసపూరిత పార్టీ
- ఎన్టీఆర్ని గద్దె దించడంలో చంద్రబాబుకి సహకరించిన వారందరూ మోసాల్లో వాటాదారులే
- అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ లాంటి వారు ముందు వరుసలో ఉంటారు.
- ప్రజాస్వామ్య వాదులు బాధపడే భాషను టీడీపీ నాయకులు వాడుతున్నారు
- 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్‌పై అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు ఎవరూ హర్షించరు.
- ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ సాధికార న్యాయానికి అర్ధం చెప్పింది సీఎం జగన్మోహన్ రెడ్డి
- బలహీన వర్గాల ప్రజలను టీడీపీ నాయకులు బానిసలుగా చూశారు
- బలహీన వర్గాలు బానిసగా ఉంటేనే పెత్తందారీలు వద్ద చేయి చాస్తారనే ఉద్ధేశం టీడీపీ నాయకులది
- పేదవాడిని పెత్తందారుల వద్దకు వెళ్లకుండా తలెత్తుకునేలా చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే
- గతంలో చంద్రబాబు పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా?
- రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే.. కార్పొరేట్ హాస్పిటల్ ని బాగుచేయడానికేనని చంద్రబాబు అన్నారు
- ఎన్నికల ముందు బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు వెనుకాడరు
- రాజకీయాల్లో అధినాయకుడు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం
- జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ నుంచి చేస్తాం
- అది రాజకీయ వ్యూహం దానిలో తప్పేముంది
- జగన్‌మోహన్ రెడ్డి వ్యూహాన్ని చూసి టీడీపీ భయపడుతుంది
- సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు టీడీపీ బెంబేలెత్తుతుంది
- బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు
- రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ వస్తే అచ్చెన్నాయుడుని పక్కకు నెట్టారు
- అలాంటి పార్టీలో ఉండి బీసీల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడితే ఎలా నమ్ముతారు?
- రానున్న ఎన్నికల్లో బీసీల చేతిలో టీడీపీ చిత్తుగా ఓడడం ఖాయం
- సామాజిక న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారు
6:50 AM, జనవరి 5, 2024
పవన్ ఛాయిస్ కాకినాడ.?
- కాకినాడ జిల్లాపై పవన్ కల్యాణ్ ప్రత్యక దృష్టి
- కాకినాడ నుంచే పోటీ చేయాలని యోచన
- కాకినాడలో సొంత ఇంటి కోసం సన్నాహాలు
- పవన్ కల్యాణ్ నివాసం కోసం అనువైన ప్రాంతాల పరిశీలన
- వార్డుల వారీగా సామాజిక వర్గాలతో భేటీలు
- ఇప్పటికే 28వార్డు పెద్దలతో మంతనాలు
- మరో రెండు మూడు రోజుల్లో కాకినాడ పర్యటన
6:40 AM, జనవరి 5, 2024
తూర్పుగోదావరిలో తప్పుతున్న పవన్ అంచనాలు
- రేపు కాకినాడ రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- మూడు రోజులు పాటు కాకినాడలోనే ఉండనున్న పవన్
- రాజమండ్రి అమలాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లతో విడివిడిగా సమావేశం
- కాకినాడ సిటీపై ఫోకస్ పెట్టిన పవన్.. డివిజన్ల వారీగా రివ్యూ చేయనున్న పవన్
- కాకినాడలో కొలిక్కిరాని పవన్ కళ్యాణ్ కసరత్తులు
- ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అద్భుత ఫలితాలు వస్తాయని తొలుత పవన్‌కు చెప్పిన నేతలు
- తీరా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
- నియోజకవర్గాల వారీగా పవన్ చేస్తోన్న సమీక్షల్లో తేడా కొడుతోన్న పరిస్థితులు
- కాకినాడలోనే మకాం వేసి జనసేన నేతలను కలుస్తోన్న పవన్ కళ్యాణ్
- చాలా వరకు మీడియాకు అనుమతి లేకుండా అంతర్గత సమావేశాలు
- తమ అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉందని తేల్చుతున్న నివేదికలు
- గత వారం కాకినాడలో 15 డివిజన్ల కార్యకర్తలతో పవన్ భేటీ
- అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జులతో సమావేశం
- పవన్‌ను కలిసిన జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
- అసలు తెలుగుదేశం-జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదని చెప్పిన చంటిబాబు
సొంత సామాజికవర్గంలోనే పవన్‌పై వ్యతిరేకత
- భీమవరంలో వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన నేతలు, కార్యకర్తలు
- టీడీపీకి జనసేన వాళ్లెవరూ ఓటేయరు: ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్
- జనసేన శ్రేణుల ఆత్మాభిమానాన్ని పవన్ దెబ్బతీశారు
- పవన్‌కళ్యాణ్‌కు సీఎం పదవి కాదు కదా, డిప్యూటీ సీఎం పదవి కూడా వచ్చే అవకాశంలేదు
- పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై పొలిట్‌బ్యూరో, చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల లోకేశ్ వ్యాఖ్యలు
- సొంత సామాజికవర్గంలోనే పవన్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది
- చంద్రబాబు రాజకీయంగా మోసగాడు, 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన ఆయన ఎన్నో వెన్నుపోటు రాజకీయాలు చేశాడు
- ప్రజలకు హామీలిచ్చి వాటిని తుంగలోకి తొక్కాడు
- పవన్‌కు కార్యకర్తల కంటే బాబే ముఖ్యమా?
- చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికే పవన్ పార్టీ పెట్టారా?.