
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క టీచర్ పోస్టు కూడా రద్దు కాదని తెలిపారు. జాతీయ విద్యావిధానంతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకుంటే భూముల కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలోభాగంగా క్రీడల ప్రోత్సాహానికి స్పోర్ట్స్ కిట్ల అందజేశారు. అందులో జత బూట్లు, ఒక డ్రెస్ ఉన్నాయి. కోవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్‌ఈపీ అమలులో ఉపాధ్యాయుల పాత్రే కీలకమని పేర్కొన్నారు.
చదవండి: నిర్ణీత సమయాల్లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: సీఎం జగన్