పారిశుధ్యంపై జూలైలో ప్రత్యేక డ్రైవ్‌ | Special drive in July on sanitation‌ | Sakshi
Sakshi News home page

పారిశుధ్యంపై జూలైలో ప్రత్యేక డ్రైవ్‌

Mar 20 2021 6:05 AM | Updated on Mar 20 2021 6:07 AM

Special drive in July on sanitation‌ - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఘన, ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఉత్తమ శానిటేషన్‌ విధానా లను మెరుగుపర్చేందుకు జూలైలో అన్ని పట్టణా లు, పల్లెల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వ హించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ శుక్రవారం పంచాయతీరా జ్, మున్సిపల్‌శాఖ అధికారులతో ఈ కార్యక్రమా లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో నూరుశాతం ఫలితాలు సా ధించే పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని సర్పంచ్‌ లు, చైర్‌పర్సన్‌లను అభినందించే కార్యక్రమాలు కూడా ఈ కార్యాచరణలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఆదర్శంగా ఉండే వారికి ప్రోత్సాహకాలిచ్చే ఆలోచన చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. 

ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి : బొత్స
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మెరుగైన పారిశుధ్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల పై విస్తృత ప్రచారం కల్పించాలని, వ్యర్థాలను ప్రా సెస్‌ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై కన్నా, ఆరోగ్యంవల్ల కలిగే లాభాలే అధికారుల ప్రథమ ప్రాధాన్యత కావాలని  సూచించారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పీఆర్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంప త్‌కుమార్, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement