మంగళగిరి వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అధికారులతో మాట్లాడుతున్న గోవిందరావు
సాక్షి, అమరావతి: ‘కార్పొరేట్’కు ధీటుగా రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ల క్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం వైద్యశాఖలో అనేక రకాల సంస్కరణలను చేపట్టి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ అమలుచేస్తున్న కార్యక్రమాలు పలు రాష్ట్రాలకు మోడల్‌గా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి అధికారులు ఇక్కడి కొచ్చి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్య యనం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో మహారాష్ట్ర వైద్య బృందం రాష్ట్రానికి వచ్చి మన కార్యక్రమాలపై అధ్యయనం చేసి, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలును ప్రశంసించారు.
ఇప్పుడు తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఏపీ విధానాలపై ఆసక్తి కనబరుస్తోంది. దేశంలోనే ఎక్కడాలేని రీతిలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ తరహా కార్యక్రమాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేప థ్యంలో.. తమిళనాడు హెల్త్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఎం. గోవిందరావు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించారు.
గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెం గ్రామంలోని డాక్టర్ వైఎ స్సార్ విలేజ్ క్లినిక్‌ను సందర్శించారు. ఈ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, హెల్త్ క్లినిక్ సేవలను పరిశీలించారు. పేపర్ రహిత వైద్యసేవల కల్పనకు అవలంబిస్తున్న విధానాలను తెలుసుకు న్నా రు. విజయవాడ జీజీహెచ్, మంగళగిరి ఇందిరా నగర్ వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఏబీడీఎం) అమలును పరిశీలించారు.
ప్రజల వద్దకే డాక్టర్ వెళ్లడం బాగుంది
తన పర్యటనలో ఏపీలోని ఆరోగ్య కార్యక్రమాల పరిశీలన అనుభవాలను గోవిందరావు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ అమలు విధానం చాలా బాగుందన్నారు. నెలలో రెండుసార్లు పీహెచ్‌సీ వైద్యులు గ్రామాల్లో ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించడం మంచి పరిణామమన్నారు.
గామస్థాయిలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా 12 రకాల వైద్యసేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని కితాబిచ్చారు. మరోవైపు.. ఏబీడీఎం అమ ల్లో భాగంగా ఇక్కడి వైద్యశాఖ అనుసరిస్తున్న విధా నాలనూ తెలుసుకున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహా కార్యక్రమం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment