సాక్షి, అమరావతి: రైతుపై పైసా భారం లేకుండా ఈ–పంటలో నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్పష్టం చేశారు. ‘ఉచిత పంటల బీమా.. అంతా మాయ’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను జాయింట్ అజమాయిషీ కింద ఈ పంటలో నమోదు చేయడంతోపాటు 93 శాతం రైతుల బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తి చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు రసీదు కూ డా ఇస్తున్నామన్నారు. కొత్తగా ఎవరి పేర్లను చేర్చడం, తీ సేయడం కానీ చేయడం లేదన్నారు.
ఖరీఫ్–2022 సీజన్‌కు సంబంధించి 10.20 లక్షల మంది అర్హత పొందితే. వారికి రూ.1, 117.21 కోట్ల బీమా పరిహారాన్ని జూలై 8న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేస్తా్తర న్నారు. ఈ పథకం ద్వారా గడిచిన నాలుగేళ్లుగా లబ్ధి పొందుతున్న రైతులను అయోమయానికి గురిచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఈనాడు నిత్యం అబద్ధాలను అచ్చు వేస్తోందన్నారు.
30 వేల పంట కోత ప్రయోగాలు చేశాం
దిగుబడి ఆధారిత పంట నష్టం అంచనాలను లెక్కించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పంట కోత ప్ర యోగాలు చేసినట్టు హరికిరణ్ పేర్కొన్నారు. వాతా వరణ ఆధారిత పంట నష్టం అంచనా కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,817 వాతావరణ కేంద్రాల్లో నమోదైన సమాచారాన్ని (అధిక/లోటు వర్షపాతం, ఉష్ణోగ్రతలు) పరిగణనలోకి తీసుకుని బీమా పరిహారాన్ని లెక్కించామన్నారు. సత్యదూరమైన ఇలాంటి కథనాలతో రైతులను గందరగోళానికి గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment