దట్టమైన హార్సిలీహిల్స్ అటవీప్రాంతం
పర్యాటకుల్లో భయాందోళనలు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడది కేంద్రం హార్సిలీహిల్స్ అడవిలో చిరుతలు ఘాట్‌రోడ్డుపై పగలు, రాత్రి సంచరిస్తూ పర్యాటకులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బైక్‌పై కొండపైకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. వీటి బారిన పడకుండా ఉండేందుకు ఘాట్‌రోడ్డును రాత్రివేళల్లో మూసివేయడం మంచిదని అటవీశాఖ చెబుతోంది.
కోవిడ్ నుంచి సంచారం
2020, 2022లో కనిపించిన చిరుతలు 2023లో కనిపించలేదు. దీంతో ఇవి అడవి నుంచి వెళ్లిపోయాయని ఊపిరిపీల్చుకున్న సందర్శకుల్లో మళ్లీ భయం మొదలైంది. వారం రోజులుగా ప్రతిరోజూ ఘాట్‌రోడ్డుపై చిరుతలు కనిపిస్తుండటంతో భయం..భయంగా రాకపోకలు సాగిస్తున్నారు. 2011 వన్యప్రాణుల లెక్కింపులో కొండపై ఒక ఆడ, ఒక మగ చిరుతలు, రెండు చిరుత పిల్లలుగా నిర్ధారించారు. అంతకుముందు కాండ్లమడుగు బీటులో చిరుత పులి పాదాన్ని గుర్తించి దాని వయసు 8 ఏళ్లు ఉంటాయని అంచనాకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఆధారాలను సేకరించారు. 2020లో లాక్‌డౌన్ సమయంలో ఎన్నడూలేని విధంగా ఆహారం కోసం కొండపైకి ఒక చిరుత వచ్చి కుక్కలను చంపి తీసుకెళ్లింది. మదనపల్లెకు చెందిన సైమన్, అతని మిత్రులు కారులో కొండపైకి వస్తున్న సమయంలో రేణిమాను మలుపు దాటిన తర్వాత ఘాట్‌రోడ్డుకు అడ్డంగా వచ్చి పిట్టగోడ దిగి అడవిలోకి వెళ్లింది. ఇది మూడేళ్ల వయసు కలిగి ఉంటుందని చూసిన సందర్శకులు చెప్పారు. ఈనెల ఒకటిన టూరి జం సిబ్బందికి మూడు చిరుతలు రోడ్డు దాటుతూ కని పించాయి. రెండురోజుల క్రితం చిరుత ఒక గొర్రెను చంపి తింది. శుక్రవారం రెవెన్యూ సిబ్బంది ఆర్డీఓ పర్యటన కోసం బైక్‌పై కొండపైకి వస్తుండగా మూడో మలుపు వద్ద చిరుతలు సంచరిస్తూ కనిపించాయి.
● హార్సిలీహిల్స్ అటవీప్రాంతం తూర్పున కురబలకోట మండలం తెట్టు, దక్షిణాన కర్ణాటకలోకి రాయల్పాడు, పడమర గట్లమీదపల్లె వరకు విస్తరించి ఉంది. హార్సిలీహిల్స్ అడవి రాయల్పాడు అడవితో కలిసి ఉంటుంది. అక్కడినుంచి కర్ణాటకలో అత్యధిక అటవీప్రాంతం ఉంది. సాధారణ చిరుతలు 100 చదరపు కి లోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తుంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ చిరుతలు సంచరిస్తూ ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఘాట్‌రోడ్డు మూసివేత?
హార్సిలీహిల్స్ అడవిలో మూడు చిరుతల సంచారంపై అటవీశాఖ అప్రమత్తమైంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్‌రోడ్డుపై రాకపోకలను నిషేధించాలని యోచిస్తున్నారు. రాత్రివేళ రాకపోకలపై ఆంక్షలు పెట్టడమే సరైన చర్యని, దీనివల్ల ప్రమాదాలను ముందుజాగ్రత్తతో అరికట్టే అవకాశం ఉంటుందని మదనపల్లె రేంజర్ మదన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం చెప్పారు. దీనిపై సమీక్షించి, అభ్యంతరాలను స్వీకరించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment