టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Wed, May 8 2024 4:25 AM

టీడీప

రైల్వేకోడూరు : రైల్వేకోడూరు నియోజకవర్గంలో కోడూరు, చిట్వేలి మండలాలల్లో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ముఖ్యంగా మంగళవారం సాయంత్రం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రభుత్వవిప్‌ కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ ముప్పాల హేమనవర్మ ఆధ్వర్యంలో రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జ్‌ హస్తి సుప్రజపాటు టీడీపీ చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హస్తి సుప్రజ మాట్లాడుతూ టీడీపీలో మహిళలకు సముచిత స్థానం దక్కడంలేదన్నారు. నియోజకవర్గంలో ఆరేళ్లుగా టీడీపీ సేవ చేస్తున్న ప్రస్తుత నియోజకవర్గ టీడీపీ రూపానందరెడ్డి పార్టీ శ్రేణులను పట్టించుకోవడం లేదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైఎస్సార్‌సీపీలో చేరానని ఈ సందర్భంగా తెలిపారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన

చిట్వేలి మండల టీడీపీ నాయకులు

నియోజకవర్గంలోని చిట్వేలి మండలంలో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. ఆనాదిగా ఆ పార్టీలో కొనసాగుతున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు మంగళవారం రైల్వేకోడూరులోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వవిప్‌ కొరముట్ల సమక్షంలో మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీని వాసులు రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పు చ్చుకున్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీ డీపీ కోసం కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించడం లేదన్నాఉ. అందుకే వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలియజేశారు. చిట్వేలి మండలంలోని నక్కలపల్లె, కుమ్మరపల్లె, కస్తూరివారిపల్లె, తుమ్మశెట్టిపల్లె, సి.కందులవారిపల్లె, మార్గోపల్లె గ్రామాల కు చెందిన 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరా యి. అలాగే రైల్వేకోడూరు మండలంలోని అయ్యవారిపల్లెలో టీడీపీ చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు లక్ష్మినారాయణమ్మ ఆద్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎల్‌వీ మోహన్‌రెడ్డి, పంజం సందీప్‌రెడ్డి, కంపరాజు నాగేంద్రరాజు, కస్తూరి పృథ్వీనాయుడు, గడికోట సంతోష్‌నా యుడు, జగదీష్‌నాయుడు, విజయ్‌, రాజేంద్ర, ఓంకార్‌, మార్గోపల్లి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
1/1

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Advertisement
Advertisement