బ్రూసెల్లా వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్‌పిళ్లై
చిన్నమండెం: సంక్రమిత వ్యాధి అయిన బ్రూసెల్లా వ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్‌పిళ్‌లై తెలిపారు. చిన్నమండెం మండల కేంద్రంలోని పశువైద్యశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బ్రూసెల్లా వ్యాధి నియంత్రణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌పిళ్‌లై మాట్లాడుతూ బ్రూసెల్లా వ్యాధి నియంత్రణకు 4–8 నెలల వయస్సు గల పెయ్య దూడలకు వ్యాక్సిన్‌ను వేస్తారని, ఈ టీకా ఇచ్చిన 21–60 రోజులలోపు సీరం నమూనాలను సేకరించి బెంగళూరులోని నివేది ఇన్‌స్టిట్యూట్‌కు సీరో కన్వర్షన్ కోసం విజయవాడలోని వీబీఆర్‌ఐ ద్వారా పంపిస్తారన్నారు. సీరో కన్వర్షన్ ఫలితాలను వీబీఆర్‌ఐ వారు విశ్లేషించి జిల్లాలకు పంపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఉపసంచాలకులు డా.మాలకొండయ్య, కడప వ్యాధి నిర్ధారణ ప్రయోగ శాల సహాయ సంచాలకులు డా.రాజశేఖర్, రాష్ట్ర స్థాయి వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు డా.తనూజ, స్థానిక సహాయ సంచాలకులు డా.శ్రీధర్‌రెడ్డి, పశువైద్యాధికారులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment