Today Horoscope: ఈ రాశివారికి ప్రముఖుల నుంచి కీలక సమాచారం | Daily Horoscope July 15-07-2024 | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారికి ప్రముఖుల నుంచి కీలక సమాచారం

Published Mon, Jul 15 2024 6:58 AM | Last Updated on Mon, Jul 15 2024 8:25 AM

Daily Horoscope July 15-07-2024

శ్రీ∙క్రోధి నామ సంవత్సరం; ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.నవమి ప.3.50 వరకు, తదుపరి దశమి; నక్షత్రం:  స్వాతి రా.10.09 వరకు. తదుపరి విశాఖ; వర్జ్యం: తె.4.10 నుండి 5.53 వరకు (తెల్లవారితే మంగళవారం); దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు, తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు; అమృత ఘడియలు: ప.12.31 నుండి 2.16 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు; యమగండం:  ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం:  5.36; సూర్యాస్తమయం: 6.34 

మేషం...ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పదవీయోగం.

వృషభం...దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. శుభవార్తలు. ఆస్తి లాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

మిథునం...రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం..ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

సింహం....బంధువులతో సఖ్యత. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు. గృహ, వాహనయోగాలు.

కన్య....ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అదనపు బా«ధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయాలు సందర్శిస్తారు.

తుల....శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.

వృశ్చికం...దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.

ధనుస్సు...కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం...పనుల్లో విజయం. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు.

కుంభం..కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మీనం..శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement