శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం,
సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32.
తిథి: శు. పాడ్యమి ఉ.9.46 వరకు, తదుపరి విదియ,
నక్షత్రం: ఆరుద్ర రా.7.11 వరకు, తదుపరి పునర్వసు,
వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.20 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.54 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
అమృతఘడియలు: ఉ.8.27 నుండి వరకు;
మేషం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఉండవచ్చు.
వృషభం: శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు పొందుతారు.
మిథునం: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సింహం: నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. శ్రమ ఫలిస్తుంది. విందువినోదాలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కన్య: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. నూతన వాహన, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
తుల: ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు డీలాపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవచింతన.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ముఖ్యమైన పనులలో జాప్యం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.
ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. చిత్రమైన సంఘటనలు. విద్యావకాశాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కవచ్చు.
మకరం: సమస్యల నుంచి గట్టెక్కుతారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనయోగం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment