సప్లిమెంటరీకి సర్వంసిద్ధం | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీకి సర్వంసిద్ధం

Published Thu, May 23 2024 6:30 AM

-

టెన్త్‌, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఈనెల 24 శుక్రవారం నుంచి జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అధికారులు పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్ట వసతులు కల్పించారు. టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను డీజీఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్‌తో పాటు ఇంటర్‌ హాల్‌ టికెట్లను బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ సైట్లలో అందుబాటులో ఉంచారు. వాటిని విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని, నేరుగా పరీక్షలకు హాజరు కావచ్చు.

టెన్త్‌ పరీక్షలకు 27 పరీక్ష కేంద్రాలు

ఈనెల 24 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 6,373 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 27 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల విధులకు 27 మంది చొప్పున చీఫ్‌ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు సహా 280 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖాధికారులు నియమించారు.

ఇంటర్‌కు 36 పరీక్ష కేంద్రాలు

ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ప్రథమ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు ఫెయిలైన వారితో పాటు బెటర్‌మెంట్‌ రాస్తున్న విద్యార్థులను కలుపుకుని 15,291 మంది హాజరు కానున్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్న ద్వితీయ సంవత్సర పరీక్షలకు 2,485 మంది హాజరు కానున్నారు.

రేపటి నుంచి పరీక్షలు

ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్‌ బోర్డు

సైట్లలో హాల్‌ టికెట్లు

టెన్త్‌ పరీక్షలకు హాజరు కానున్న

6,373 మంది

ఇంటర్‌ పరీక్షలకు 17,776 మంది

పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు

Advertisement
 
Advertisement
 
Advertisement