బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Published Thu, Nov 7 2024 1:51 AM | Last Updated on Thu, Nov 7 2024 1:51 AM

బాపట్

బాపట్ల

గురువారం శ్రీ 7 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

9

అర్హులందరికీ

సంక్షేమ పథకాలు

బాపట్ల: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. ఆధార్‌, రేషన్‌ కార్డుల మంజూరుపై మండల తహసీల్దార్లతో బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఆధార్‌ కార్డులు లేక ఎస్టీలు నష్టపోతున్నారని తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, జనన, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌ గౌడ్‌, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

డీఆర్వోగా బాధ్యతల స్వీకరణ

బాపట్ల: జిల్లా రెవెన్యూ అధికారిగా జి.గంగాధర్‌గౌడ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ ఆయనకు సూచించారు. ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి కూడా జిల్లా కలెక్టర్‌ కలిశారు.

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త విడుదల

మార్కాపురం: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త కళ్లి నాగిరెడ్డి విడుదల అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై ఎక్స్‌లో పోస్టు పెట్టారని వచ్చిన ఫిర్యాదుపై మంగళవారం మార్కాపురం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కేసు నమోదు చేశాక 41ఏ నోటీసు ఇచ్చి మంగళవారం రాత్రి విడుదల చేశారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీఆర్‌డీఏ కలిపే ప్రతిపాదనకు బుధవారం ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నియోజకవర్గంలోని వేమూరు, చుండూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల పరిధిలో ఉన్న 89 గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకోనున్నారు. తాజా ప్రతిపాదనతో 562 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తాజాగా సీఆర్‌డీఏలో చేరనుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి వేమూరు నియోజకవర్గాన్ని అందులో కలిపారు. అయిదేళ్లుగా వేమూరు బుడాలో ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి సీఆర్డీఏను పునరుద్ధరించి ఈ నియోజకవర్గాన్ని అందులో కలపాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఏపీ క్యాబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది.

లేనిది ఉన్నట్టుగా కనికట్టు

2014లో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్‌డీఏను ఏర్పాటు చేసి అమరావతిని అద్భుతమైన రాజధానిగా మారుస్తున్నట్లు గొప్పలు చెప్పింది. ఆచరణలో అది ఎక్కడా కనిపించలేదు. నిజంగా సీఆర్‌డీఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా అప్పట్లో ఐదేళ్ల మాదిరిగానే ఇప్పుడూ గ్రాఫిక్స్‌ చూపిస్తూ భ్రమరావతిగా మార్చితే మాత్రం ప్రయోజనం శూన్యం. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అప్పట్లో సేకరించిన భూములతో వ్యాపారం చేసుకున్నారు తప్పించి రాజధాని నిర్మాణం మరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా నాలుగు భవనాలకు పునాదులు వేసి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. గ్రాఫిక్స్‌ రాజధానిని సిద్ధం చేసి పచ్చ పత్రికల్లో రోజుకో ఫొటో ప్రచురించి అసెంబ్లీ ఇలా, సచివాలయం అలా, కోర్టు భవనాలు ఇలా, రాజగోపురాలు అలా, సిటీ ఇలా అంటూ కేవలం ఆర్భాటాలకే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పరిమితమైంది. సింగపూర్‌ గ్రాఫిక్స్‌తో కొన్నాళ్లు నడిపించారు.

ఇప్పుడైనా అభివృద్ధి జరిగేనా?

గతంలో ఐదేళ్ల కాలం వెళ్లదీశారు. రాజధాని కన్నా అక్కడి భూములపైనే చంద్రబాబు సర్కార్‌కు మక్కువని, అందుకే రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి రాజధాని నిర్మాణ బాధ్యతలు మంత్రి నారాయణకే అప్పగించారు. సీఆర్డీఏను విస్తృతం చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి చేయకుండా పరిధి పెంచడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గతంలో వేమూరు నియోజకవర్గం సీఆర్‌డీఏలోనే ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగించినా ఒరిగింది ఏమీ లేదు. రోడ్లు, డ్రెయినేజీలతోపాటు ప్రత్యేకంగా మౌలిక వసతుల కల్పన జరగలేదు. ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయలేదు. కనీసం కృష్ణా కరకట్టను ఆధునికీకరించలేదు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కూటమి పాలనలోనైనా అభివృద్ధి చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

5 మండలాలు, వాటి పరిధిలోని 89 గ్రామాల విలీనానికి ఆమోదం

వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో బుడాలో నియోజకవర్గం అంతకుముందూ సీఆర్‌డీఏలోనే ఉన్నా ప్రగతి శూన్యం చంద్రబాబు గ్రాఫిక్స్‌తో ప్రజలకు తప్పని అవస్థలు

వేమూరు మరోమారు సీఆర్‌డీఏలోకి చేరింది. ఇకనైనా ప్రగతి బాట పట్టాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే తరహాలో విలీనం చేసినా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. తాజాగా క్యాబినేట్‌ తీసుకున్న నిర్ణయంతో మరోమారు ఈ ప్రాంత వాసులు అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నారు. గ్రాఫిక్స్‌, కాగితాలకే ప్రగతి పరిమితం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాపట్ల1
1/10

బాపట్ల

బాపట్ల2
2/10

బాపట్ల

బాపట్ల3
3/10

బాపట్ల

బాపట్ల4
4/10

బాపట్ల

బాపట్ల5
5/10

బాపట్ల

బాపట్ల6
6/10

బాపట్ల

బాపట్ల7
7/10

బాపట్ల

బాపట్ల8
8/10

బాపట్ల

బాపట్ల9
9/10

బాపట్ల

బాపట్ల10
10/10

బాపట్ల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement