రెస్టారెంట్ నిర్వాహకులపై ఆగని వేధింపులు
పర్చూరు (చినగంజాం): పర్చూరులోని అపర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులపై అధికార పార్టీ నాయకులు వేధింపులు ఆపలేదు. రెండో రోజు బుధవారం సైతం జేసీబీలను తీసుకొని వచ్చి మట్టిని మరో 5 అడుగుల లోతు తవ్వి రెస్టారెంట్‌కు అడ్డంగా పోయించారు. నిర్వాహకులను మరింత అసౌకర్యానికి గురి చేశారు. బుధవారం ఉదయం రెస్టారెంట్లోకి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఆహారం తీసుకునేందుకు వచ్చిన పలువురు వినియోగదారులు అక్కడే ఉండిపోయారు. వారు బయటకు వచ్చేందుకు మార్గం మూసుకుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఏదో విధంగా ఇబ్బందికి గురి చేసేందుకు అధికారులను ఉపయోగించి అధికార పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని రెస్టారెంట్ నిర్వాహకుడు కొడవలి అప్పయ్య చౌదరి వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment