గ్రామాల అభివృద్ధిపై ముగిసిన తొలి విడత శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై జిల్లా, మండలస్థాయి అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో రెండు రోజులపాటు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈసందర్భంగా పల్నాడు జిల్లా పరిధిలోని 28 మండలాలకు చెందిన అధికారులకు, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తొమ్మిది సూత్రాల ఆధారిత అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ ఆర్. కేశవరెడ్డి, పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి ఎంవీ భాస్కరరెడ్డి సమన్వయంతో జరిగిన శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ కె.మోహనరావు, ఏపీఎం జవన్, డీపీఎం డి.రవీంద్రబాబు, బి. దయాసాగర్, డీపీ ఆర్సీ జిల్లా సమన్వయకర్త ఎస్. పద్మరాణి, కె. నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నేడు, రేపు గుంటూరు, బాపట్ల జిల్లాలకు..
గురు, శుక్రవారాల్లో గుంటూరు, బాపట్ల జిల్లాలకు చెందిన అధికారులకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment