లబ్ధి గోరంత.. నిబంధనలు కొండంత!
బాపట్ల టౌన్: ఎన్నికల సమయంలో కూటమి నేతలు నోటికొచ్చిన హామీ ఇచ్చారు. మహిళల ఓట్లు రాబట్టేందుకు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. నాలుగు నెలలకు కూడా అరకొరగా ఈ పథకం అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అర్హులందరికీ ఇవ్వకుండా నిబంధనల పేరిట లబ్ధిదారుల సంఖ్య తగ్గించారు. దీపం–2 పథకం కింద చేసే సాయం కొంతే అయినా పేదలు చిక్కులెన్నో ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆధార్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, గ్యాస్ కనెక్షన్ల వివరాలు ఒకేలా ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ తప్పనిసరిగా జరిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌లో ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి తేడా ఉన్నా వారు అనర్హులవుతారు. దీనికితోడు రోజుకోక మార్గదర్శకాలు జారీ అవుతున్నాయి. ఆధార్ సీడింగ్ సమయంలో ఆదాయం ఎక్కువ ఉందని గుర్తిస్తే ఉచిత సిలిండర్ ఇవ్వకపోవడమే కాదు... ఏకంగా రేషన్‌కార్డు కూడా తీసేసే అవకాశం కూడా ఉంది.
ముందు చెల్లిస్తే.. తర్వాత ఇస్తారా?
ఉచితం మాటున మరో మెలిక పెట్టింది కూటమి సర్కార్. తొలుత వినియోగదారులు సిలిండరుకు నగదు చెల్లించాలి. 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం ఆ మొత్తం జమ చేయనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో అందరికీ అంటూ ఇప్పుడు కొందరికే ఇస్తున్న సర్కారలు... ఇలాంటి నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అసలు గ్యాస్ సిలిండర్ తీసుకున్నాక.. దాని ఖరీదు మొత్తం ఎంత సక్రమంగా లబ్ధిదారులకు జమ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బాపట్ల జిల్లాలో 1,02,187 మందిని అనర్హులుగా ఇప్పటికే తేల్చేశారు. మొత్తం 33 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 4.58,520 కనెక్షన్లు ఉన్నాయి. వాటిల్లో 3,56,333 మంది మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
నియోజకవర్గం మొత్తం కనెక్షన్లు అనర్హులు
బాపట్ల 64,025 12,000
చీరాల 76,496 18,155
పర్చూరు 82,088 16,701
అద్దంకి 91,156 19,523
వేమూరు 79,155 15,006
రేపల్లె 65,600 20,802
మొత్తం 4,58,520 1,02,187
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై గందరగోళం రోజురోజుకూ మారుతున్న మార్గదర్శకాలు వాస్తవంగా జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 4,58,520 వీరిలో దాదాపు లక్ష మందికి ప్రభుత్వం మొండిచేయి
Comments
Please login to add a commentAdd a comment