కోలాహలంగా సూర్యలంక తీరం
బాపట్ల టౌన్: కార్తిక పౌర్ణమికి ముందు సోమవారం కావడంతో సూర్యలంక తీరానికి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు, బస్సుల ద్వారా తరలివచ్చారు. సాగరంలో సూర్య నమస్కారాలతో స్నానాలాచరించారు. అనంతరంతీరం వెంబడి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇసుకతో గౌరీదేవి ప్రతిమ, శివలింగాలను తయారు చేశారు. వాటి ముందు ముగ్గులేసి మధ్యలో గొబ్బెమ్మలను ఏర్పాటుచేశారు. శివలింగానికి పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజలనంతరం గౌరీదేవి ప్రతిమలతోపాటు గంగమ్మకు ఇష్టమైన పూలు, పండ్లను సముద్రంలో కలిపి పుణ్యస్నానాలాచరించారు. అనంతరం తీరం వెంట ఉన్న ఆంజనేయస్వామి, త్రికోటేశ్వరస్వామి దేవాలయాల వద్ద పూజలు నిర్వహించారు. తీరానికి వచ్చిన భక్తులు, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా రూరల్ సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. మండలంలోని నాగేంద్రపురంలో గల నాగేంద్రస్వామి దేవాలయంలోని ఉసిరిచెట్టు వద్ద మహిళలు అధిక సంఖ్యలో పూజలు చేశారు.
పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment