నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలోకి దూసుకెళ్లిన బైక్
పర్చూరు (చినగంజాం): ద్విచక్రవాహనంపై వెళ్తూ హెచ్చరిక బోర్డులు గుర్తించక నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన పర్చూరు పీఎస్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పర్చూరు మండలం గణపవరం గ్రామానికి చెందిన జంపని ప్రసాద్ (38) చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తుంటాడు. ప్రతి రోజు చీరాల వెళ్లి వస్తుంటాడు. ఈక్రమంలో అర్ధరాత్రి సమయంలో తన ద్విచక్రవాహనంపై చీరాల నుంచి పర్చూరు రోడ్డులో వస్తున్నాడు. ఆ మార్గంలో ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద డైవర్షన్ హెచ్చరిక బోర్డులను గుర్తించకపోవడంతో బైకు నేరుగా బ్రిడ్జిలోకి దూసుకెళ్లింది. అతని తల బ్రిడ్జి కాంక్రీట్ గోడలకు బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం ఉదయం బ్రిడ్జి వద్ద మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పర్చూరు ఎస్‌ఐ మాల్యాద్రి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సిబ్బంది సాయంతో బయటకు తీయించి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అక్కడికక్కడే వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment