సీఎం పర్యటనను విజయవంతం చేయండి
బాపట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని జిల్లా అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశమయ్యారు. బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ ఏడో తేదీన జరిగే విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని కలెక్టర్ చెప్పారు. అధికారిక సమాచారం వచ్చినందున అధికారులంతా అప్రమత్తం కావాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు చేపట్టాల్సిన పనులను వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓ పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.
వేడుకగా కార్తిక
కోటి దీపోత్సవం
కారంచేడు: కార్తిక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని ఉదయం నుంచి మండల కేంద్రమైన కారంచేడు రెండు చెరువుల మధ్య కొలువైన వైష్ణవి దుర్గామాత ఆలయంలో భక్తులు పెద్దఎత్తున ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రాత్రికి గ్రామంలోని అనేకమంది మహిళలతో కలసి కోటి దీపోత్సవ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
రేపు యూపీపీఎస్సీ
ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష
నెహ్రూనగర్: యూపీపీఎస్సీ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్షను ఈ నెల 27న గుంటూరు నగరంలోని బీసీ స్టడీ సర్కిల్(రాజాగారితోట)లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఉదయం 10.30గంటలకు బీసీ స్టడీ సర్కిల్‌కు వద్ద హాజరుకావాలని ఆమె సూచించారు.
నేటి నుంచి
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఏఎన్‌యూ: దక్షిణ, పశ్చిమ మండలాల(జోన్స్) అంతర్ విశ్వవిద్యాలయాల సీ్త్ర, పురుషుల వెయిట్ లిఫ్టింగ్ మంగళవారం నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతాయని పోటీల నిర్వహక కార్యదర్శి, ఏఎన్‌యూ వ్యాయామ విద్య డైరెక్టర్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ తెలిపారు. పోటీలకు వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. మహిళల కేటగిరీ పోటీలు మంగళవారం నుంచి 28 వరకు, పురుషులకు ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో 125 విశ్వవిద్యాలయాల నుంచి వెయిట్ లిఫ్టర్లు హాజరుకాన్నారని తెలిపారు. మంగళవారం జరిగే పోటీల ప్రారంభోత్సవ సభకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ప్రత్యేక ఆహ్వానితులుగా అర్జున అవార్డు గ్రహీత నీలంశెట్టి లక్ష్మి, ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామయ్య, యూనివర్సిటీ అధికారులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. పోటీలకు వీసీ ఆచార్య కె గంగాధరరావు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారని పాల్ కుమార్ తెలిపారు.
పవర్ లిఫ్టింగ్‌లో
షబీనాకు బంగారు పతకం
తెనాలి: పట్టణానికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా మరో విజయం సాధించింది. సదరన్ రైల్వే, సేలమ్ డివిజన్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలో నిర్వహించిన సౌతిండియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం కై వసం చేసుకుంది. ఈ పోటీల్లో 84 కిలోల విభాగంలో తలపడిన షబీనా, స్క్వాట్‌లో 190 కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 90 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 180 కిలోల చొప్పున మొత్తం 460 కిలోల బరువులనెత్తి, ఓవరాల్‌గా ఈ విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment