వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ గ్రామ,వార్డు వలంటీర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఆమె వలంటీర్లతో కలిసి నిరసన తెలిపారు. కె.ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం వలంటీర్లును విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10వేలు వేతనం హామీ నెరవేర్చాలని, జాబ్‌చార్ట్ ప్రకటించాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వలంటీర్లును వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన తెలిపిన వారిలో కె.అనూష, షేక్.షహీరా, యు.శ్రీనివాసులు, ఎం.జ్యోతి తదితరులు ఉన్నారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి వినతిపత్రం అందించారు.
ఏపీ వలంటీర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment