పట్టాలిచ్చి నోటీసులు ఇవ్వడం విడ్డూరం
బల్లికురవ: రెవెన్యూ అధికారులు నివేశన స్థలాలకు సంబంధించిన పట్టాలిచ్చినా.. అవి చెల్లుబాటు కావని ఓ ఎన్‌ఆర్‌ఐ కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమనడం విడ్డూరంగా ఉందని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు తంగిరాల వెంకటేశ్వర్లు వాపోయారు. సోమవారం ఎస్‌ఎల్ గుడిపాడు పంచాయతీలోని సిపాయి కాలనీ గిరిపుత్రులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం సర్వే నంబరు 36, 37లో 35 మంది గిరిజనులకు తలా రెండున్నర సెంట్ల నివేశన స్థలం, పక్కా ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయగా ఇళ్లు నిర్మించుకుని హాయిగా జీవిస్తున్నారన్నారు. అయితే ఓ ఎన్‌ఆర్‌ఐ తాను కోనుగోలు చేసిన భూమిలో ఈ కాలనీ ఉందంటూ నోటీసులతో బెదిరిస్తున్నాడన్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆగడాలకు అడ్డుకట్టవేయకపోతే తాము ఎంతటి ఆందోళకై నా సిద్ధమని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
మంత్రికి వినతి పత్రం..
బల్లికురవలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు హాజరైన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వెంకటేశ్వర్లు గిరిజనులతో కలిసి అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి తక్షణమే ఆ భూములను పరిశీలించి గిరిజనులకు న్యాయం చేయాలని, పట్టా భూమి అయితే ల్యాండ్ ఎక్విజేషన్‌తోనైనా సమస్య పరిష్కారించాలని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకు సూచించారు. ఈ గ్రీవెన్స్‌లో రెవెన్యూ హౌసింగ్‌లకు సంబంధించి 52 అర్జీలు అందజేశారు. తహసీల్దార్ కవిత ఎంపీడీఓ కుసుమకుమారి, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు సిపాయి కాలనీ గిరిజనుల ధర్నా మంత్రి గొట్టిపాటికి వినతిపత్రం
Comments
Please login to add a commentAdd a comment