చిలకలూరిపేట: అభం శుభం ఎరుగని ఆరేళ్ల చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గణతంత్ర దినోత్సవం నాడు ఈ దారుణం చోటుచేసుకుంది. రూరల్ సీఐ బి.సుబ్బా నాయుడు తెలిపిన వివరాల మేరకు... చిలకలూరిపేట మండలంలోని ఓ గ్రామ ఎస్టీ కాలనీకి చెందిన బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన క్రమంలో ఇతర బాలలతో కలిసి ఆడుకుంటోంది. ఇది గమనించిన అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు పాలపర్తి గోవింద్ బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఎంతకూ బాలిక అతని ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో తోటి పిల్లలు ఆ ఇంట్లోకి తొంగి చూడగా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నిస్తూ కనిపించాడు. దీంతో ఇరుగుపొరుగు వారికి పిల్లలు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
పోలీసుల అదుపులో నిందితుడు
Comments
Please login to add a commentAdd a comment