పోటాపోటీగా ఎద్దుల బల ప్రదర్శన
ప్రథమ స్థానం పొందిన గుంటూరు, బాపట్ల జిల్లాల గిత్తలు
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి వజ్రోత్సవ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలు జరిగాయి. 4 పండ్ల సైజ్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనలో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేలం పద్మానాయుడు గిత్తలు, బాపట్ల జిల్లా మండల కేంద్రమైన జె.పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు గిత్తలు సమానంగా 3,900 అడుగుల దూరం లాగాయి. ప్రథమ, ద్వితీయ బహుమతులు కలిపి రూ. 70 వేలను కై వసం చేసుకున్నాయి. పల్నాడు జిల్లా శావల్యపురం మండలం మతుకుపల్లి గ్రామానికి చెందిన ముండ్రు జీవప్రసాద్, బాపట్ల జిల్లా మండల కేంద్రమైన సంతమాగులూరుకు చెందిన గిత్తలు 3,711 అడుగుల దూరం లాగి మూడో బహుమతి రూ. 25 వేలు దక్కించుకున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య గిత్తలు 3,705.10 అడుగుల దూరం లాగి 4వ బహుమతి రూ.20 వేలను దక్కించుకున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామానికి చెందిన ఎం. జయకృష్ణ చౌదరి, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం నరసపల్లె గ్రామానికి చెందిన దోప్పరి లక్ష్మిదేవి గిత్తలు 3,663.5 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ.18 వేలను కై వసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండేపాడు గ్రామానికి చెందిన చాగంటి శ్రీనివాస్ చౌదరి గిత్తలు 3,600 అడుగుల దూరంలాగి 6వ బహుమతి రూ.16 వేలను దక్కించుకున్నాయి. నంద్యాల జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లె గ్రామానికి చెందిన నరసింహ గిత్తలు 3,469 అడుగుల దూరం లాగి 7వ బహుమతి రూ. 14 వేలను గెలుచుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన శివ గిత్తలు 3,401.8 అడుగులు లాగి 8వ బహుమతి రూ. 12 వేలను దక్కించుకున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన ఎం. నవీన్‌కుమార్, పల్నాడు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామానికి చెందిన ఆర్. హరిబాబు గిత్తలు 3,369 అడుగులతో రూ. 9 వేలను కై వసం చేసుకున్నాయి. ఈ బలప్రదర్శనలో మొత్తం 15 జతలు పాల్గొన్నాయి. మిగిలిన 6 జతలకు కూడ రూ. 3 వేల చొప్పున అందచేసినట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, అల్లం ప్రతాప్‌రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్‌రెడ్డి, బి. రామకృష్ణ, ఓ. ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, గాదె కస్పారెడ్డి, కె. జోసఫ్‌రెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాస్ వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment