హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా
● డీఎస్పీ రామాంజనేయులు ● ఫిబ్రవరి ఒకటి నుంచి నిబంధనలు అమలు
బాపట్ల టౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించడం ఖాయమని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. పట్టణ ప్రజలకు హెల్మెట్ వాడటంపై బుధవారం అవగాహన కల్పిస్తూ ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారని వెల్లడించారు. రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ప్రధానంగా తల భాగంలో గాయాలు అవుతాయని, హెల్మెట్ ధరించడం వల్ల రక్షణ పొందవచ్చని తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలతోపాటు చలనాలు కూడా విధిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ రాంబాబు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment