ఇంటిని మరిపించేలా పాఠశాలలు | Sakshi
Sakshi News home page

ఇంటిని మరిపించేలా పాఠశాలలు

Published Sun, May 26 2024 4:15 AM

ఇంటిని మరిపించేలా పాఠశాలలు

అశ్వారావుపేటరూరల్‌/దమ్మపేట : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను ఇంటిని మరిపించేలా సిద్ధం చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ప్రతీక్‌ జైన్‌ తెలిపారు. అశ్వారావుపేట మండలం భీమునిగూడెం ఆశ్రమ పాఠశాలను, దమ్మపేట మండలంలోని అంకంపాలెం, పార్కలగండి, పెద్దగొల్లగూడెం, చీపురుగూడెం అశ్రమ పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల ఆవరణల్లో పచ్చదనాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల వసతి గదులను పరిశీలించి మంచాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు సరిపడా ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ ఉదయ్‌భాస్కర్‌, డీఈ రామి రెడ్డి, ఏటీడీఓ చంద్రమోహన్‌, ఏఈ సుబ్బరాజు, పాఠశాలల హెచ్‌ఎంలు పద్మ, తోలెం వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, భద్రమ్మ, ధర్మ పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement