
దేశీయ ఈక్విటీ మార్కెట్ బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 బుల్ జోరు కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.24 నిమిషాలకు సెన్సెక్స్ 257 పాయింట్లు లాభంతో 71,593 వద్ద నిఫ్టీ 70 పాయింట్లతో 21,519 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగించాయి.
అయితే అరగంటలో మార్కెట్ ట్రెండ్‌ను పసిగట్టిన మదుపర్లు అమ్మకాల్ని ఉదృతం చేశారు. దీంతో మార్కెట్‌లో బుల్ తన జోరును మరింత పెంచింది. వెరసి 10 గంటల సమయానికి సెన్సెక్స్ 380 పాయింట్ల లాభంతో 71717 వద్ద, నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 21559 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
ఆల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్,బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్,ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, లార్సెన్, టాటా స్టీల్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్,సిప్లా, టైటాన్ కంపెనీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, మారుతి సుజికీ, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాలతో ఊగిసలాడుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).