Indian Creators Hail Xs Ads Revenue Scheme share Screenshots - Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్‌ క్రియేటర్లు

Published Tue, Aug 8 2023 8:38 PM | Last Updated on Wed, Aug 9 2023 9:43 AM

Indian Creators Hail Xs Ads Revenue Scheme share Screenshots - Sakshi

Twitter Ad-Revenue Sharing భారతీయ కంటెంట్ క్రియేటర్లు కూడా ఎక్స్‌(ట్విటర్‌)  ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మాస్క్‌  ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ ద్వారా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పండగ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను  సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు. యాడ్‌-రెవన్యూ షేర్‌ ఫీచర్‌పై ట్వీపుల్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.  (మోటో జీ14: ఫీచర్లు అదుర్స్‌! ధర తెలిస్తే వదిలిపెట్టరు!)

ఇంప్రెషన్‌ల వల్ల  సుమారు  2.1 లక్షలు సంపాదించానంటూ @గబ్బర్‌సింగ్ హ్యాండిల్‌ యూజర్‌ అభిషేక్ అస్థానా,  స్క్రీన్ షాట్‌ను పంచుకున్నారు. ''బ్లూ టిక్ కే పైసే వసూల్'' అంటూ కమెంట్‌ చేశారు.  ట్విటర్‌ స్ట్రాటజీ చాలా  సింపుల్‌. ఈ వ్యూహంతో  భారీగా సంపాదించిన  ఇన్‌ఫ్లుయెన్సర్లే బ్లూ టిక్ సేల్స్‌మెన్‌గా మారతారు.. ఇదే నిజమైన ఆదాయ వనరు అని పేర్కొన్నారు.  'మైథున్' అనే వినియోగదారు తన బ్యాంక్ ఖాతాలో  రూ. 3,51,000 జమ  అయ్యాయంటూ  స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. 455.75  డాలర్లు వచ్చాయి. గత 3 నెలల్లో దాదాపు 17మిలియన్ల ఇంప్రెషన్లు, 25కే ఫాలోవర్లు ఉన్నారంటూ మరొక యూజర్‌ తెలిపారు.  బెంచ్‌మార్క్  సాధించాలంటే  ఏం  కావాలో తెలిపారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్‌ ఆఫర్‌)

కాగా ఎంపిక చేసిన కంటెంట్ సృష్టికర్తలు వారి ప్రత్యుత్తరాలలో వచ్చేప్రకటనల నుండి వచ్చే ఆదాయంలో వాటాను పొందవచ్చు. ఎక్స్‌ ప్రకటనల రాబడి భాగస్వామ్యానికి అర్హత పొందాలంటే, వెరిఫైడ్  క్రియేటర్‌లు గత 3 నెలల్లో వారి పోస్ట్‌లపై కనీసం 5 మిలియన్ ఇంప్రెషన్‌లు కలిగి ఉండాలి. వెరిఫైడ్ క్రియేటర్లకు వారి కంటెంట్ రిప్లై సెక్షన్‌లో యాడ్స్ వస్తాయని ఎలాన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మొదటి పేమెంట్ల కోసం 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41.2 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. (ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌: మహీంద్ర థార్‌పై బంపర్‌ ఆఫర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement