గతకొన్ని రోజుల నుంచి కెనడా - భారత్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెనడా పౌరులకు వీసాల మంజూరును సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు, ఇదే కొనసాగితే భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు మరింత బలపడే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల.. ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. కెనడా నుంచి ఎక్కువగా ధాన్యాలు దిగుమతి అయ్యేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మునుపటికంటే 6 శాతం దిగుమతి తగ్గినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!
2022 - 23 ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా గణనీయమైన పాత్రను పోషించింది, ఇది భారతదేశం యొక్క మొత్తం పప్పు దిగుమతుల్లో సగానికి పైగా ఉంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏకంగా 1,90,784 టన్నులు దిగుమతి చేసుకున్నట్లు భారతదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తోంది.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్‌లో 5 లక్షల ఉద్యోగాలు!
ప్రస్తుతం భారతదేశం కూడా కెనడా మీద ఎక్కువ ఆధారపడకుండా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల మీద ఆధారపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కానీ ఇండియన్ మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అధికారిక ఆవివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment