pulses prices
-
పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు!
రైతులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ దేశీయ పప్పుల అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పప్పుల దిగుమతులు 2023-24లో గతంలోకంటే దాదాపు రెండింతలు పెరిగి 3.74 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల టన్నుల పప్పు దినుసులు ఎగుమతి చేసుకున్నట్లు అంచనా. ఇది అంతకుమందు ఏడాదిలో 24.5 లక్షల టన్నులుగా ఉంది. దేశీయంగా పప్పు ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా పప్పు దినుసుల దిగుమతుల కోసం బ్రెజిల్, అర్జెంటీనాలతో ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిసింది. చర్చలు సఫలమైతే బ్రెజిల్ నుంచి మినుములు, అర్జెంటీనా నుంచి కందులను దిగుమతి చేసుకోనుంది. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఇప్పటికే మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం పసుపు బఠానీల దిగుమతిపై ఈ ఏడాది జూన్ వరకు సుంకాన్ని వసులు చేయకూడదని నిర్ణయించింది. ఇప్పటికే మినుములు, కందుల దిగుమతులకు ఈ నిబంధన వర్తిస్తోంది. మార్చి 31, 2025 వరకు వీటిని సుంకం లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వ తెలిపింది. ఎన్నికల సమయంలో ఆందోళన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పప్పుల ధరల ద్రవ్యోల్బణం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విధంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం మార్చిలో 17 శాతం నమోదైంది. దాంతో గత కొంతకాలంగా పప్పు ధరలు పెరుగుతున్నాయి. వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15న పప్పు నిల్వలపై పరిమితులను విధించింది. ఇదీ చదవండి: ‘మేడ్ ఇన్ ఇండియా’ సర్వర్లు ప్రారంభించిన ప్రముఖ కంపెనీ ప్రభుత్వం గ్యారెంటీ కొనుగోలు, ఎంఎస్పీ వంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ దేశీయంగా గత కొంతకాలంగా ఉత్పత్తి క్షీణిస్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం 2023-24లో పప్పుధాన్యాల ఉత్పత్తి 234 లక్షల టన్నులుగా ఉంది. అంతకుమందు ఏడాది 261 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. -
భారత్‌లో పెరగనున్న ధాన్యం ధరలు! కారణం ఇదే..
గతకొన్ని రోజుల నుంచి కెనడా - భారత్ మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కెనడా పౌరులకు వీసాల మంజూరును సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కెనడా నుంచి పప్పు ధాన్యాల దిగుమతి భారీగా తగ్గినట్లు, ఇదే కొనసాగితే భారతదేశంలో ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో వాణిజ్య ఆంక్షలు మరింత బలపడే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మన దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల.. ఇండియా ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. కెనడా నుంచి ఎక్కువగా ధాన్యాలు దిగుమతి అయ్యేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మునుపటికంటే 6 శాతం దిగుమతి తగ్గినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో పప్పు ధాన్యాల దిగుమతుల్లో కెనడా గణనీయమైన పాత్రను పోషించింది, ఇది భారతదేశం యొక్క మొత్తం పప్పు దిగుమతుల్లో సగానికి పైగా ఉంది. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏకంగా 1,90,784 టన్నులు దిగుమతి చేసుకున్నట్లు భారతదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడిస్తోంది. ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు! ప్రస్తుతం భారతదేశం కూడా కెనడా మీద ఎక్కువ ఆధారపడకుండా ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల మీద ఆధారపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. కానీ ఇండియన్ మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరిన్ని అధికారిక ఆవివరాలు తెలియాల్సి ఉంది. -
భగ్గుమంటున్న పప్పుల ధరలు.. కేంద్రం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పప్పుధాన్యాల ధరలు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ళ వానల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రభావం పప్పు ధాన్యాల ధరలపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. పప్పు ధాన్యాల నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని టోకు వ్యాపారులు, మిల్లర్లను ఆదేశించింది. అంతేకాకుండా దిగుమతులపై ప్రత్యేకంగా దృషి పెట్టింది. దేశంలో పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 1.67 కోట్ల హెక్టార్లు కాగా, గత ఏడాది 1.27 కోట్ల హెక్టార్లకు పడిపోయింది. కంది, మినుము అధికంగా సాగయ్యే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలతో ఈ నష్టం మరింత పెరుగనుంది. ఫలితంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది కందిపప్పు ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇది గత ఏడాది ఉత్పత్తి కంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. మినప ఉత్పత్తితోనూ 3 నుంచి 5 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గ్రేడ్–1 కందిపప్పు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కిలో రూ.125 నుంచి రూ.135 దాకా పలుకుతోంది. మిగతా పప్పుల ధరలు సైతం 8 నుంచి 10 శాతం వరకూ పెరిగాయి. దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం పప్పు ధాన్యాల స్టాక్ హోల్డర్లు, టోకు వ్యాపారులు, రిటైలర్లు, మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 28.66 లక్షల టన్నుల పప్పు ధాన్యాల నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం తేలి్చంది. వివిధ పోర్టుల్లో ఉన్న నిల్వలను పరిశీలించింది. ఈ వివరాలను నాఫెడ్ వెబ్సైట్లో పొందుపర్చింది. ఎక్కడైనా నిల్వలు తగ్గిపోతే మరొక చోటు నుంచి దిగుమతి చేసుకోవాలని సూచించింది. కంది, పెసర, మినప పప్పుల ధరలు పెరగకుండా చూడాలని అధికారులకు కేంద్ర ఆహార శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
కేంద్ర మద్దతు ధర కంటే తక్కువగా..
-
నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మొత్తం 500 కొనుగోలు కేంద్రాలను అధికారులు గుర్తించారు. పది జిల్లాల్లో ఇంకా పంట చేతికి రానందున ముందస్తుగా అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 95 కేంద్రాల్లో కందులు, శనగల కొనుగోళ్లు ప్రారంభిస్తున్నారు. రెండో విడత ఫిబ్రవరి 15న పసుపు, జొన్న, మొక్కజొన్న, అపరాల కొనుగోళ్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లు పురస్కరించుకుని రాష్ట్రంలో ఎక్కడా గోదాముల కొరత రాకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కొనుగోళ్ల ప్రారంభానికి అధికారులు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. కేంద్ర మద్దతు ధర కంటే తక్కువగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో కందులు, శనగపప్పు ధరలున్నాయి. కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,800లు, శనగకు రూ.4,875, మినుములకు రూ.5,700, పెసలకు రూ.7,050లను కేంద్రం ప్రకటించింది. కానీ, కందులకు బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.4,800 నుంచి రూ.5,000, శనగకు రూ.3,800ల ధర పలుకుతోంది. నాలుగైదు రోజుల నుంచి పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు రేటు ఇంకా తగ్గించి కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులను ముందుగానే ఊహించిన మార్క్‌ఫెడ్.. జిల్లాల్లోని రైతులను అప్రమత్తం చేస్తోంది. పంటను కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుని ఉండాలని, లేదా క్షేత్రస్థాయిలోని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని సూచిస్తోంది. పంట నమూనాలను కొనుగోలు కేంద్రంలోని అధికారులకు ముందుగా చూపించి, ఆ తర్వాతే పంటను తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ శాఖ అంచనా మేరకు కందుల దిగుబడి లక్ష నుంచి లక్షా పాతిక వేల టన్నుల వరకు ఉండొచ్చు. అయితే, రాష్ట్రానికి 23,500 మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అనుమతించింది. దీంతో 70 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతివ్వాలని మార్క్‌ఫెడ్ అధికారులు కోరారు. గోదాముల కొరత లేకుండా చర్యలు గత ఏడాది పంటల సేకరణ సమయంలో గోదాముల కొరత ఏర్పడింది. దీంతో రాయలసీమలో కొనుగోలు చేసిన పంటను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గోదాముల్లో నిల్వచేశారు. ఫలితంగా ప్రభుత్వంపై రవాణా ఖర్చుల భారం పడింది. ఈ పరిస్థితులను పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈసారి శాశ్వత కొనుగోలు కేంద్రాలను ప్రకటించింది. అదేవిధంగా ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించిన గోదాముల్లోనే పంటను నిల్వ చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఆ కార్పొరేషన్‌కు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. కొంతవరకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు చెందిన బియ్యాన్ని నిల్వచేస్తున్నా, కొనుగోలు చేయనున్న మిగిలిన పంటలను అక్కడ నిల్వచేయనున్నారు. అలాగే, మరో లక్ష మెట్రిక్ టన్నుల పంటలకు సరిపడా గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
పప్పుల ధరలకు కళ్లెం!
మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి - బఫర్ నిల్వలు పెంచాలని కేంద్రం నిర్ణయం - జైట్లీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం - జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ధరల సమస్యకు పరిష్కారం - ధరల అదుపులో రాష్ట్రాలకూ సమాన బాధ్యత: పాశ్వాన్ న్యూఢిల్లీ: ఆకాశాన్నంటిన పప్పుధాన్యాల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేజీకి రూ.170 వరకు పలుకుతున్న పప్పుల రేట్లను అదుపులోకి తేవడానికి ఉన్నతస్థాయిలో సమావేశమై పరిష్కార మార్గాలపై చర్చించింది. దీనికోసం పప్పుధాన్యాలను ఆఫ్రికా, మయన్మార్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతోపాటు బఫర్ నిల్వలను పెంచాలని నిర్ణయించింది. ధరల మంటలపై కేంద్రంపై ముప్పేట దాడి నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందిస్తూ... నిత్యావసరాల ధరల నియంత్రణలో రాష్ట్రాలకూ సమాన బాధ్యత ఉందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో బుధవారమిక్కడ జరిగిన సమావేశంలో పాశ్వాన్తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ‘కేజీ రూ.170కి ఎగబాకిన పప్పులు, రూ.100కు చేరిన టమోటాలపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ధరల పెరుగుదలకు కారణాలను, వాటిని అదుపులోకి తేవడానికి గల ప్రత్యామ్నాయ మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు’ అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 70 లక్షల టన్నుల డిమాండ్ మేరకు సరఫరాలేదన్నారు. రాష్ట్రాల నుంచి డిమాండ్లు వచ్చినప్పుడు బఫర్ స్టాక్ నుంచి ఎక్కువ నిల్వలు విడుదల చేయడంతోపాటు మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలపై చర్చించారు. ‘ధరల కట్టడి కోసం మరిన్ని బఫర్ నిల్వలు పెంచాలని మా శాఖకు చెప్పారు. ఈ ఏడాది బఫర్ స్టాక్‌ను 1.5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే ఖరీఫ్, రబీ సీజన్లలో 1.15 లక్షల టన్నులను కొన్నాం. రబీ సేకరణ ఇంకా కొనసాగుతోంది’ అని పాశ్వాన్ తెలిపారు. పప్పుధాన్యాలు ఎక్కువగా పండించే మయన్మార్, ఆఫ్రికా లాంటి దేశాలకు వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారని, ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి దిగుమతి చేసే మార్గాలపై అన్వేషిస్తారని తెలిపారు. ముడి కంది, మినప్పప్పులను బఫర్ నుంచి రూ. 66కు కొని వినియోగదారులకు రిటైల్‌గా పప్పును రూ.120కి మించకుండా సరఫరా చేయాలని రాష్ట్రాలకు చెప్పామన్నారు. రాష్ట్రాలు బఫర్ పెంచుకోవడంలో ఆసక్తిచూపడం లేదని ఆరోపించారు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదంతోపాటు జాతీయ వ్యవసాయ ఉమ్మడి మార్కెట్ కార్యరూపంలోకి వస్తే ధరల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. లోటును అధిగమించి దేశంలో సరఫరా పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా దిగుమతి చేసుకుంటామని జైట్లీ చెప్పారు. సేకరణను, సాగును పెంచే అంశాలతోపాటు అక్రమ నిల్వదారులపై చర్యల గురించి కూడా సమావేశంలో చర్చించారు. ప్రైవేటు దిగుమతిదారుల కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచే అంశాన్నీ చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం బఫర్ నుంచి 10వేల టన్నుల పప్పుధాన్యాలను ఇప్పటికే విడుదల చేసింది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) మొబైల్ వ్యాన్ల ద్వారా కందిపప్పు, మినప్పప్పును కేజీ రూ.120కి విక్రయించే కార్యక్రమాన్ని పాశ్వాన్ ఢిల్లీలో ప్రారంభించారు. కేంద్రీయ భండార్, సఫల్తోపాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కందిపప్పు, మినప్పప్పును కేజీ రూ.120కి విక్రయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక సలహాదారు చెప్పారు. -
నోరు కట్టుకోండి..!
ముందుగా గుండెనిండా గాలిని ప్రశాంతంగా పీల్చుకోండి. బీపీ, సుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నాయో లేదో చూసుకోండి. మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ఆహ్లాదంగా ఉంచుకోండి. ఇదేదో యోగా తరగతుల్లో గురువులు బోధిస్తున్న తీరు అనుకోకండి. ప్రస్తుతం మార్కెట్లకు సరుకులు కొనేందుకు వెళ్లే వినియోగదారులు ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోక పోతే గుండెలు గుభేల్ మనక తప్పదు. కూరగాయల నుంచి..నిత్యవసరాల ధరలు చుక్కలను తాకుతుండడంతో ఏర్పడిన పరిస్థితి. నోటిరుచి మాట దేముడెరుగు.. ముచ్చటగా నాలుగు ముద్దలు కూరలతో తిందామన్నా ఖరీదు చేయలేని దుర్భరత. సామాన్య, మధ్య తరగతి వారికి చెమటలు పట్టిస్తున్న రేట్ల తీరు. పాలమూరు, న్యూస్‌లైన్ : బస్తాలో డబ్బులు తీసుకుపోతే.. సంచుల్లో సరుకులు తీసుకునే రోజులు వస్తాయన్న నానుడి ఇప్పుడు అక్షరసత్యాలు అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులను కుదేల్ చేస్తున్నాయి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేద, మధ్యతరగతి వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరుమాసాల కిందట రూ.50 నుంచి రూ.60 ఉన్న పెసర, కందిపప్పు ధరలు ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతోపాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధరకూడా అమాంతంగా పెరిగి పోయింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఎండు కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు సన్న బియ్యం (బీపీటీ) ధరలు కొద్దిగా తగ్గినట్లు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల ధరలదీ అదేబాట. కూరగాయలదీ అదే రూటు కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే అంతా హడలెత్తి పోతునానరు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళితే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా దేన్ని ముట్టుకున్నా కిలో రూ.20కి పైమాటే. ప్రస్తుతం జిల్లాలో కూరగాయలసాగు తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.