![Salaries of Google employees leaked software engineers earn Rs 5 90 crore base salary - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/21/Salaries-of-Google-employees-leaked.jpg.webp?itok=AylILDe6)
ప్రపంచంలో ఎక్కువ శాలరీలు అందిస్తున్న సంస్థల్లో ఒకటి 'గూగుల్' (Google). చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా లీక్ అయిన ఒక డేటా ప్రకారం, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్యాకేజ్ వంటి వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, సంస్థ తన ఉద్యోగుల సగటు వేతనం 2022లో సుమారు 2,79,802 డాలర్లు అని తెలిసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.30 కోట్లు వేతనంగా పొందుతున్నట్లు సమాచారం. అదే సమయంలో 2022లో గరిష్ట ప్రాధమిక జీతం 7,18,000 డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 5.90 కోట్లు. అంటే ఉద్యోగి గరిష్ట వార్షిక వేతనం సుమారు రూ. 6 కోట్లు వరకు ఉంటుంది.
గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఎక్కువ జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇంజినీరింగ్ మేనేజర్, డైరెక్ట్ సేల్స్ ఇలా మొదలైన వారు ఉన్నారు. ఎక్కువ శాలరీ తీసుకున్న ఉద్యోగులు ఎవరనేది ఈ కింద చూడవచ్చు.
(ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఐటీ కంపెనీల కీలక ప్రకటన!)
- సాఫ్ట్‌వేర్ ఇంజనీర్: 7,18,000 డాలర్లు (రూ. 5.90 కోట్లు)
- ఇంజినీరింగ్ మేనేజర్: 4,00,000 డాలర్లు (రూ. 3.28 కోట్లు)
- ఎంటర్‌ప్రైజ్ డైరెక్ట్ సేల్స్: 3,77,000 డాలర్లు (రూ. 3.09 కోట్లు)
- లీగల్ కార్పొరేషన్ కౌన్సిల్: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
- సేల్స్ స్ట్రాటజీ: 3,20,000 డాలర్లు (రూ. 2.62 కోట్లు)
- యుఎక్స్ డిజైన్: 3,15,000 డాలర్లు (రూ. 2.58 కోట్లు)
- గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ: 3,12,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)
- రీసర్చ్ సైంటిస్ట్: 3,09,000 డాలర్లు (రూ. 2.53 కోట్లు)
- క్లౌడ్ సేల్స్: 3,02,000 డాలర్లు (రూ. 2.47 కోట్లు)
- ప్రోగ్రాం మేనేజర్: 3,00,000 డాలర్లు (రూ. 2.46 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment