దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 581.79 పాయింట్లు లేదా 0.73 శాతం క్షీణించి 78,886.22 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 180.50 పాయింట్లు లేదా 0.74 శాతం పడిపోయి 24,117 వద్ద ముగిసింది.
నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 39 దిగువన ముగియడంతో, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ 4.9 శాతం వరకు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 భాగస్వామ్య స్టాక్‌లలో 25 రెడ్‌లో స్థిరపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టెల్ టాప్ డ్రాగ్‌లుగా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Money Mantra
Comments
Please login to add a commentAdd a comment