టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్రం తెచ్చిన 'లోకల్'ప్రతిపాదనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు భారత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డ్రాగన్ కంట్రీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో భారత్ పై ఆయన తీరు ఎలా ఉన్నా.. మనదేశంలో టెస్లా కార్ల తయారీ యూనిట్లను మొదలుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టెస్లా ఇండియాలో అడుగుపెట్టకపోతే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో సత్తా చాటేందుకు దేశీయ ఆటోమొబైల్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రముఖ ఆటోమోటీవ్ అండ్ డివైజ్ ఈకోసిస్టమ్ రీసెర్చ్ ఎనలిస్ట్ సౌమెన్ మండల్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్‌కు తెలిపారు.ఈ సందర్భంగా టెస్లాతో పాటు ఆపిల్ సైతం భారత్‌లో అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఉత్పత్తులే ముందు.. ఆ తర్వాతే ఏదైనా
భారత్‌లో టెస్లా కార్లను తొలత విక్రయించి.. ఆ తర్వాత తయారీ యూనిట్లు ప్రారంభిస్తామని ఎలాన్ మస్క్ ప్రకటించారు. కానీ కేంద్రం దేశీయంగా టెస్లా కార్ల విక్రయం కంటే ఇక్కడ నిర్మించబోయే ఫ్యాక్టరీలపై స్పష్టత ఇవ్వాలని టెస్లాను కోరింది. టెక్ దిగ్గజం ఆపిల్ సీఈఓ టీమ్ కుక్ సైతం ముంబైలో ఫస్ట్ బ్రాండెడ్ రీటైయిల్ స్టోర్‌తో పాటు అసెంబ్లింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కానీ చిప్ షార్టేజ్ వల్ల సాధ్య పడలేదు. త్వరలో ఆపిల్, టెస్లా సమస్యలు ఓ కొల్లిక్కి వస్తాయని, వచ్చే ఏడాది నాటికి ఆ రెండు దిగ్గజ కంపెనీలు దేశీయ తయారీ యూనిట్లను ప్రారంభించనున్నట్లు ఎనలిస్ట్ సౌమెన్ మండల్ అన్నారు.
ఇబ్బందుల్లో ఆటోమొబైల్ సంస్థలు..
మైక్రోచిప్ షార్టేజ్ వల్ల ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సౌమెన్ మండల్ చెప్పారు.ముఖ్యంగా స్టెల్లాంటిస్,వోక్స్‌వ్యాగన్, టయోటా,బీఎండబ్ల్యూ, ఫోర్డ్ కంపెనీలు కార్ల ఉత్పత్తుల్ని తగ్గించాయన్న సౌమెన్ మండల్..2023 నాటికి చిప్ షార్టేజ్ కొరత తగ్గిపోతుందని ఆటోమొబైల్ సంస్థలు భావిస్తున్నాయన్నారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం వచ్చే ఏడాదిలోపే చిప్ సమస్య తొలగిపోతుందనే ధీమాగా ఉన్నారని వెల్లడించారు.
చదవండి: వీడే ఫ్యూచర్ ఎలన్‌మస్క్.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓపెన్ లెటర్
Comments
Please login to add a commentAdd a comment