రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ ఇతర దేశాలకు శాపంగా మారింది. మొక్కజొన్న, గోధుమలకు హబ్‌గా పేరొందిన ఆ రెండు దేశాల సంక్షోభం గ్లోబల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే నిత్యవసర ధరలు, చమురు ధరలు పెరగడంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్- రష్యా దేశాల నుంచి ఎగుమతయ్యే గోదుమల ధరలు భారీగా పెరిగినట్లు యూఎన్ ఫుడ్ ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ) తెలిపింది.
ఇప్పటి వరకు ఇతర దేశాలకు రష్యా 18శాతం గోదుమల్ని ఎగుమతి చేస్తుంటే.. 2019లో ప్రపంచ గోధుమల ఎగుమతుల మార్కెట్‌లో రష్యా-ఉక్రెయిన్ ఈ రెండు దేశాల వాటా 25.4 శాతంగా ఉండేది. అయితే రష్యా -ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభానికి వారం రోజుల ముందే గోధుమల ధరలు 55శాతం పెరగ్గా.. ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధరలు ఒక్క ఫిబ్రవరి నెలలో రికార్డ్ స్థాయిలో 24.1శాతం పెరిగినట్లు ఎఫ్‌ఏఓ వెల్లడించింది.
యూరప్ దేశాలకు దెబ్బే!
ఉక్రెయిన్ నుంచి గ్లోబల్‌గా మొక్కజొన్న 16శాతం ఎగుమతి అవుతుంటే, రష్యా- ఉక్రెయిన్ దేశాల నుంచి 30శాతం గోధుమలు ఎగుమతి అవుతున్నాయి. రష్యా గోధుమల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడీ ఈ యుద్ధ సంక్షోభం ప్రపంచ దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ కు భారీ షాకనే చెప్పుకోవాలి.
ఉదాహరణకు యూరప్ కంట్రీస్‌లో ఓ దేశమైన టర్కీకి రష్యా నుంచి 78శాతం గోధుమలు ఎగుమతి అవుతుంటే 9శాతం ఉక్రెయిన్ నుంచి రవాణా అవుతున్నాయి. ఇప్పుడీ యుద్ధం కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. ఆహార ధరలు ఆకాశన్నంటాయి.
నట్టేట ముంచిన నల్ల సముద్రం
సముద్ర రవాణాకు నల్లసముద్రం ప్రసిద్ధి. ప్రపంచంలో ధాన్యాన్ని ఎగుమతి చేసే రెండో రవాణా ప్రాంతంగా ఈ నల్ల సముద్ర భూభాగంలో ఉన్న దేశాలుగా కొనసాగుతుంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కారణంగా ధాన్యం రవాణా పూర్తిగా ఆగిపోవడంతో ప్రపంచ దేశాలకు చెందిన కొన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది.
భారత్ సంగతేందీ?
ప్రపంచ దేశాలకు చెందిన పలు దేశాలకు ఉక్రెయిన్ - రష్యా దేశాల నుంచి గోధుమలు, మొక్కజొన్న ఎగుమతులు కాకపోవడం తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నాయి. కానీ మనదేశంపై ఎలాంటి ప్రభావం పడలేదని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.భారత్ గోధుమల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. కొన్నేళ్లుగా ఈ ఎగుమతుల విషయంలో భారత్ ప్రధాన ఎగుమతి దేశంగా ప్రసిద్ధి చెందింది. 2020లో మనదేశం $243,067,000 ఖరీదైన గోధుమల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) లెక్కల ప్రకారం 2020-2021 జులై నుంచి జూన్ మధ్య కాలంలో భారత్ 1.8 మిలియన్ టన్నుల గోధుమల్ని ఎగుమతి చేసినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ దేశాల ప్రభావం ఆహారా ధాన్యాల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ భవిష్యత్‌లో భారత్ తీసుకున్న తటస్థ ధోరణి ఎగుమతుల విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆర్ధిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
చదవండి: పుతిన్.. నీకు అర్థమవుతుందా? సెమీకండక్టర్లకు యుద్ధం దెబ్బ
Comments
Please login to add a commentAdd a comment