17న సంకటహర గణపతి వ్రతం
కాణిపాకం: వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈనెల 17వ తేదీన సంకట హర గణపతి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొన్నాలని ఆయన కోరారు.
ప్రపంచకప్ టెక్నికల్
అఫిషియల్‌గా పీఈటీ సురేష్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రపంచకప్ ఖోఖో పోటీలకు టెక్నికల్ అఫిషియల్‌గా ప్రభుత్వ పాఠశాల పీఈటీ సురేష్ ఎంపికై నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని యాదమరి మండలం కొటాలం జెడ్పీ హైస్కూల్‌లో పీటీగా విధులు నిర్వహిస్తున్న సురేష్ ప్రపంచకప్ ఖోఖో పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఈ నెల 13 నుంచి 19 వ తేదీ వరకు న్యూఢిల్లీలో మొట్టమొదటి ప్రపంచకప్ ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 24 దేశాలకు చెందిన మహిళలు, పురుషులు పాల్గొంటారన్నారు. ఈ పోటీలకు జిల్లా నుంచి టెక్నికల్ అఫిషియల్‌గా సురేష్ ఎంపిక కావడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం ఆయన్ని జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, శరత్‌బాబు అభినందించారు.
సెలవుల్లో తరగతులు
నిర్వహిస్తే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : సంక్రాంతి సెలవుల్లో ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని డీఈఓ వరలక్ష్మి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుంటాయన్నారు. ఈ సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని తెలిపారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారన్నారు. ఆ సెలవుల్లో ఫిబ్రవరి నెలలో సర్దుబాటు చేస్తామన్నారు. సెలవుల్లో పాఠశాలలు నిర్వహించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీవైఈఓ, ఎంఈఓ, సీఆర్పీలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. టీచర్లు త్వరతిగతిన టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టిస్)లో వివరాలు నమోదు చేయాలన్నారు. టిస్ నమోదులో చిత్తూరు జిల్లా వైఎస్సార్ కడప జోన్‌లో మొదటి స్థానంలో ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,142 మంది వెంటనే వివరాలు నమోదు చేయాలని డీఈఓ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment