ప్రభుత్వ వైఫల్యమే
తిరుపతిలో గోవింద భక్తుల మరణాలకు కారణం ప్రభుత్వ వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన ఏడుగురు తొక్కిసలాటలో మరణించడం దురదృష్టకరం. ఈ మరణాలకు ముమ్మాటికీ సీఎం చంద్రబాబు, టీటీడీ పాలకమండలిదే బాధ్యత. ప్రమాదంతో ఈ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ మరణాలు చంద్రబాబు అసమర్థపాలనతో ప్రభుత్వం చేసిన హత్యలే. ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలకమండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు టికెట్లకు వచ్చిన వారు చనిపోయిన చరిత్ర ఇప్పటి వరకు టీటీడీలో లేదు. లడ్డూ వ్యవహారంలో ఏదో జరిగిందని ఊగిపోయిన సనాతన యోధుడు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు.
– ఆర్కేరోజా, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి
ఈ పాపం చంద్రబాబుదే
గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 22 మంది.. మొన్న విజయవాడలో వరద విలయానికి 20 మంది.. నిన్న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. ఇదంతా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా..? ఈ పాపం చంద్రబాబుది కాదా?. ఈ మహాపచారానికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి. తిరుమల చరిత్రలో ఇలాంటి దురదృష్టకర ఘటన నేనింత వరకూ చూడలేదు. – కళత్తూరు నారాయణస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి
ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
తిరుపతిలో చోటు చేసుకున్న విషాద ఘటనకు పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆధ్యాత్మిక నగరం తిరువీధులు బుధవారం రాత్రి ఆర్తనాదాలతో భీతిల్లి పోయాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు, వారి బంధువులు స్వగ్రామాలకు మృతదేహాలతో ఊరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం దారుణం.
– కళత్తూరు కృపాలక్ష్మి, వైఎస్సార్ సీసీ జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్
Comments
Please login to add a commentAdd a comment