మైనర్‌పై అత్యాచారం.. అర్ధనగ్నంగా సెల్ఫీ తీసి స్నేహితులకు.. | Hyderabad Crime: Molestation On Minor Girl In Moosapet | Sakshi
Sakshi News home page

మైనర్‌పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. 

Published Fri, Apr 16 2021 2:50 PM | Last Updated on Fri, Apr 16 2021 4:59 PM

Hyderabad Crime: Molestation On Minor Girl In Moosapet - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: ఓ బాలికపై దూరపు బంధువైన ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగ్‌రావు వివరాల ప్రకారం.. మూసాపేట జనతానగర్‌లో నివాసముంటున్న జై బాలు (25), ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ బాలికను గత నెల 17న తన పుట్టిన రోజు ఉందని ఇంటికి పిలిపించుకొని అత్యాచారం చేసి అర్ధనగ్నంగా ఓ సెల్ఫీ తీసి తన స్నేహితులకు పోస్టు చేశాడు.

ఆ ఫొటో బాలిక బంధువులకు చేరటంతో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఈ 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బలవంతంగా తనను అత్యాచారం చేసినట్లు బాలిక ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు జై బాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

చదవండి: గెస్ట్‌ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement