పక్కా ప్లాన్‌.. భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య | Wife pours petrol On Husband In Warangal | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌.. భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య

Jan 10 2022 2:34 PM | Updated on Jan 10 2022 3:16 PM

Wife pours petrol On Husband In Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వరంగల్‌: భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కట్టుగుట్టతండాకు చెందిన భూక్యా శంకర్‌(30) తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈనెల 2న మద్యం సేవించిన శంకర్‌ ఇంట్లో మత్తుగా పడుకున్నాడు. భర్తను హతమార్చాలని పక్కా ప్లాన్‌ వేసుకున్న అతడి భార్య అర లీటరు పెట్రోల్‌ కొనుక్కొని వచ్చింది.

మద్యం మత్తులో నిద్రలో ఉన్న శంకర్‌పై పెట్రోల్‌ పోసి పోయిలోని నిప్పు తెచ్చి అంటించి పరారయ్యింది. మంటలు చెలరేగడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి నీరు పోసి ఆర్పారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఖమ్మం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్‌ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి తండ్రి బావ్‌సింగ్‌ ఫిర్యాదు మేరకు శంకర్‌ భార్య కవితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
చదవండి: ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement