Young Man Molested on 11 Years Minor Girl at Visakhapatnam - Sakshi
Sakshi News home page

అన్నా.. అని వేడినా కనికరించలేదు.. ఆ మాటలు విని వారి గుండెలు బద్దలైపోయాయి

Published Sat, Jan 22 2022 7:05 AM | Last Updated on Sat, Jan 22 2022 8:39 AM

Young Man Molested on Minor Girl at Visakhapatnam - Sakshi

పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలి బంధువులు, గ్రామస్తులు, అత్యాచారానికి పాల్పడ్డ నాగేశు 

సాక్షి, నక్కపల్లి (విశాఖపట్నం): అన్నయ్యా అని పిలిచినా కనికరించలేదు.. కాళ్లావేళ్లా పడ్డా వదిలిపెట్టలేదు.. నోరెత్తితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు.. అన్నయ్యను కాదు, మామయ్యను అవుతానంటూ లైంగిక దాడి చేశాడు.. ఈ దారుణ ఘటన గురువారం రాత్రి నక్కపల్లి మండలం రాజయ్యపేటలో జరిగింది. 11 ఏళ్ల మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేశు (22) అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాధిత బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చేసరికి వంట చెరకు కోసం ఆమె సోదరి పక్కనే ఉన్న జీడితోటకు వెళ్లింది. ఆమెకు సహాయపడేందుకు బాధితురాలు కూడా తోటకు బయలుదేరింది. ఈ విషయం గమనించిన నిందితుడు ఆమె వెంట వెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. బాలికను వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని కత్తితో బెదిరించాడు. అంతేకాకుండా బాధితురాలి సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి తన మొబైల్‌కు పంపించాలని చెప్పాడు. అలా ఆ బాలికను నాలుగు గంటలపాటు చిత్రహింసలకు గురిచేశాక రాత్రి 9 గంటల సమయంలో తనే ఇంటి వద్ద వదిలివెళ్లాడు.

చదవండి: (మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. ప్రేమజంట..) 

తమ చిన్న కుమార్తె కనిపించలేదని కంగారుగా వెతుకుతున్న తల్లిదండ్రులు.. ఎట్టకేలకు ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆమె చెప్పిన విషయం విని వారి గుండెలు బద్దలైపోయాయి. వెంటనే బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం సెక్షన్‌ 5 (ఎం), (హెచ్‌), ఆర్‌డబ్ల్యూ 6, సెక్షన్‌ 12 కింద, ఐపీసీ 376 (ఎఫ్‌), 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ నారాయణరావు తెలిపారు. 

చదవండి: (విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..)

రాత్రి స్టేషన్‌కు వెళితే పొద్దున్న రమ్మన్నారు: బాధితుల ఆవేదన 
తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారు పొద్దున్న రమ్మన్నారని, వెంటనే స్పందించలేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సీఐ నారాయణరావును వివరణ కోరగా రాత్రి స్టేషన్‌కు వచ్చిన సంగతి తనకు ఉదయం తెలిసిందని, రాతపూర్వక ఫిర్యాదుతో రాకపోవడంతో ఉదయం రమ్మని నక్కపల్లి స్టేషన్‌ సిబ్బంది చెప్పి ఉండవచ్చన్నారు. తనకు సమాచారం తెలిసిన వెంటనే నిందితుడు ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement