నగర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నేడు నెరవేరబోతూండటం చాలా సంతోషంగా ఉంది. పెన్షనర్ ప్యారడైజ్‌గా పేరొందిన కాకినాడ.. కళలకు కాణాచి. ఇటువంటి నగరంలో అన్ని సౌకర్యాలతో ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది ఇంత కాలానికి నెరవేరడం, నగర ప్రజలకు, వైఎస్సార్ సీపీకి ఎన్నో సేవలందించిన ఫ్రూటీ కుమార్ పేరిట ఇది ఏర్పాటు కానుండటం చాలా సంతృప్తినిస్తోంది. క్రీడాభిమానుల కోరిక స్కేటింగ్ రింక్, 14 ఏళ్ల క్రితం శంకుస్థాపనకే పరిమితమైన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ వంతెనను పూర్తి చేసుకుని, ప్రారంభించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వారధిగా సీఎం నామకరణం చేయనుండటం మరింత సంతోషకరం.
– ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి,
ఎమ్మెల్యే, కాకినాడ సిటీ
Comments
Please login to add a commentAdd a comment