వైఎస్సార్ సీపీకి సేవలందిస్తాం..
సినీ ఆర్టిస్టు జోగినాయుడు
కొత్తపేట: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు శిరసా వహిస్తూ, పార్టీకి సేవలందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రముఖ సినీ ఆర్టిస్ట్, కల్చరల్ కమిషన్ మాజీ చైర్మన్ జోగినాయుడు అన్నారు. కొత్తపేటకు చెందిన పండితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి (రామం) ఆధ్వర్యంలో గురువారం కొత్తపేట సమీపంలోని ధనమ్మమర్రి వద్ద నిర్వహించిన కార్తిక వన సమారాధనలో జోగినాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి తాను చేసిన సేవలను గుర్తించి అప్పట్లో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కల్చరల్ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. సుమారు ఏడాదిన్నర కాలంలో సంతృప్తిగా కళారంగానికి సేవలందించానన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ గ్రాఫిక్స్మయం అయ్యిందన్నారు. భవిష్యత్‌లో మరింత టెక్నాలజీతో చిత్ర నిర్మాణం జరుగుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఐఈ) టెక్నాలజీ ప్రారంభమైందన్నారు. ఇందులో ఏదైనా ఎక్కడైనా క్రియేట్ చేయవచ్చన్నారు. చిత్రాన్ని నిర్మిస్తున్న లొకేషన్‌కు హీరో రావాల్సిన అవసరం లేకుండా షూటింగ్ జరపవచ్చన్నారు. ప్రస్తుతం ఆ టెక్నాలజీ వచ్చిందన్నారు. చిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశాలు విశాఖ పరిసరాల్లో ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో స్టుడియో నిర్మిస్తానని తెలిపారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment