అమలాపురం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రోత్సహించడానికి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు రూపకల్పన చేసినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రారంభమైందన్నారు. ఆరు నుంచి 12వ తరగతి విద్యార్థులకు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిగణనలోకి తీసుకుని వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ఒక అద్భుతమైన వేదికను అందిస్తోందని డీఈఓ తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీసం 30 మంది విద్యార్థులతో 2 లేదా 3 మంది సభ్యులు ఉండే బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలన్నారు. ఆ బృందం రూపొందించిన ప్రాజెక్టును పోర్టల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. అప్లోడ్ చేసిన ప్రాజెక్టును సంబంధిత ఉపాధ్యాయుడు ఆమోదించాలన్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 30 నాటికి పూర్తి కావాలన్నారు. ఇన్నోవేషన్ మారథాన్ ద్వారా ప్రదర్శించిన ప్రతిభా వంతుల ప్రాజెక్టులు భవిష్యత్ భారత సృష్టికి మేల్కొలుపును కలిగిస్తాయని, స్కూల్ టీచర్‌లు విద్యార్థులు సమయానికి తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తగిన కృషి చేయాలని డీఈఓ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment