సామాజిక ప్రయోజనం చేకూర్చే పనులకు ప్రాధాన్యం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా ఖనిజ నిధి ద్వారా గతంలో ప్రతిపాదించి, ప్రారంభం కాని వాటి స్థానంలో కొత్తగా సామాజిక ప్రయోజనం చేకూర్చే పనులను ప్రతిపాదించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన జిల్లా ఖనిజ నిధి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖల ఆధ్వర్యాన చేపట్టిన వివిధ పనుల పురోగతి, పెండింగ్ అంశాలపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన పనులకు సంబంధించి స్టేజి వారీగా ఫొటోలతో కూడిన ప్రగతి నివేదికలు సమర్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా ప్రాధాన్య పనులు చేపట్టడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి వివిధ దశల్లో ఫొటోలతో కలిపి బిల్లులు అందజేస్తే పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, చెల్లింపులు జరుపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment