కపిలేశ్వరపురం: దొంగతనం నేరారోపణలో విచారణాంశాలు రుజువు కావడంతో నలుగురు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ఆలమూరు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి ఐ.ప్రవీణ్‌కుమార్ గురువారం తీర్పు చెప్పారు. అంగర ఎస్సై డి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తన ఇంటిలో రాత్రి సమయంలో బంగారం, వెండి ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయంటూ కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన గరగపాటి సూర్యకుమారి 2023 జూలై 17న అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై జి. చంటి కేసు నమోదు చేశారు. కేసులో నిందితులైన కాజులూరుకు చెందిన షేక్ అజీజ్, రాజమహేంద్రవరానికి చెందిన యడ్ల ఉషా సూర్య వెంకట రాకేష్, తాతపూడికి చెందిన కాండ్రేగుల శ్రావణ కృష్ణ, ఇంద్రపాలెంనకు చెందిన ముషినాడ గౌరీ మల్లేశ్వరి నేరం చేసినట్లు రుజువైంది. నిందితులకు మూడేళల సాధారణ జైలు శిక్ష, రూ.పదివేల చొప్పున జరిమానా విధిస్తూ ఆలమూరు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. బాధితురాలి తరపున ఏపీపీ విల్లా శ్రీరాములు వాదించారు.
రేపటి నుంచి
రోలర్ స్కేటింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా రోలర్ స్కేటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అమలాపురం బాలయోగి స్కేటింగ్ రింగ్‌లో ఈ నెల 11,12 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి 2వ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరుగుతాయని జిల్లా స్కేటింగ్ క్లబ్ ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment