సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోళ్ల బాబు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోళ్ల అచ్యుత రామారావు (బాబు) ( శివజ్యోతి థియేటర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరంలో హోటల్‌లో జరిగిన సినీ ఎగ్జిబిటర్ల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కాకినాడ శ్రీలక్ష్మి టాకీస్ శ్రీనుబాబు, కోశాధికారిగా మండపేట సత్యశ్రీ రాంబాబు, ఉపాధ్యక్షులుగా పిఠాపురం సత్య థియేటర్ చినబాబు, ద్రాక్షారామ సదాశివరావు, సంయుక్త కార్యదర్శిగా లక్కవరం వేణుగోపాల్ థియేటర్ నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 8మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment