ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

Published Sun, May 26 2024 4:05 AM

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ఏలూరు(మెట్రో): ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లను, కౌంటింగ్‌ కేంద్రాలను, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు అన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ హాలులోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల వంటివి అనుమతించమన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ అనుమతించరాదన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ హాళ్లను కలెక్టర్‌ పరిశీలించి సూచనలు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ను తనిఖీచేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్‌లో కలెక్టర్‌ సంతకం చేశారు. వీరి వెంట ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఏలూరు ఆర్డీఓ ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఏలూరు ఆర్వో, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం. ముక్కంటి, సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Advertisement
 
Advertisement
 
Advertisement